ఇబ్బందుల్లో హీరో సునీల్, ఆ రెండూ చేజారి పోయినట్లేనా?
వరుస ప్లాపులు ఎదురు కావడంతో హీరో సునీల్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది.
Recommended Video

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్.... ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించాయి, కొన్ని హిట్టయ్యాయి. అయితే సక్సెస్ రేటు తగ్గడంతో సునీల్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల జోలికి పోకుండా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీని నమ్ముకుని రోటీన్ సినిమాలు తీస్తుండటంతో సునీల్ వరుస ప్లాపులు చవిచూడాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో సునీల్‌కు చెప్పుకోవడానికి ఒక్క హిట్ట కూడా లేదు. దీంతో సునీల్ మార్కెట్ డౌన్ అయిందని ట్రేడ్ వర్గాల టాక్.

ఇబ్బందుల్లో సునీల్ కెరీర్
సునీల్ నటించిన చివరి చిత్రం ‘ఉంగరాల రాంబాబు'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నిరాశ మిగిల్చింది. ఈ ఫలితంతో సునీల్ కెరీర్ ఇబ్బందుల్లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ రెండు సినిమాలు ఆగి పోయాయా?
‘ఉంగరాల రాంబాబు' సినిమా తర్వాత సునీల్ రెండు ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. అయితే ఆ రెండు ప్రాజెక్టులు ఇపుడు సునీల్ చేజారి పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సునీల్ బదులు మరో హీరో కోసం?
తమిళంలో హిట్టయిన ‘సతురంగ వెట్టై' చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను ఆయన సునీల్ హీరోగా చేయాలనుకున్నారు. అయితే ఇపుడు సనీల్ మార్కెట్ డౌన్ కావడంతో... ఆయనకు బదులు వేరే హీరోతో చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఎన్ శంకర్ మూవీ ఏమైనట్లు?
మలయాళం హిట్ మూవీ ‘2 కంట్రీస్' తెలుగులో సునీల్ హీరోగా ప్లాన్ చేశారు దర్శకుడు ఎన్.శంకర్. అయితే సునీల్ వరుస ప్లాపులతో ఈ సినిమా కూడా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

కమెడీ పాత్రల వైపు సునీల్?
సునీల్ మళ్లీ ఇతర హీరోల సినిమాల్లో కామెడీ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి సిద్ధమైనట్లు ఇటీవల కాలంలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నిజం ఎంత? నిజంగానే సునీల్ తనకు హీరో పాత్రలు కలిసి రావడం లేదని ఇటు వైపు టర్న్ అవుతున్నారా? అనే విషయంలో ఓ క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











