మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో పెళ్లి వేడుక.. ప్రముఖ పారిశ్రామికవేత్తతో వియ్యం.!

మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయా..? ఆయన ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నారా.? ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగిపోయాయా..? అంటే దాదాపుగా అవుననే ప్రచారం జరుగుతోంది. అవును.. నాగబాబు ఇంట్లో త్వరలోనే పెళ్లి జరగబోతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ వార్త సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఈ పెళ్లి నిహారికకా..? వరుణ్ తేజ్‌కా..? పూర్తి వివరాల్లోకి వెళితే...

నిహారిక సమయం కోరింది

నిహారిక సమయం కోరింది

గతంలో నిహారిక.. కెరీర్ పరంగా తాను సెటిల్ అయ్యేంత వరకు సమయం కావాలని, అప్పటి వరకు తన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నానని మీడియాతో వెల్లడించిన విషయం తెలిసిందే. నాగబాబు దగ్గరే కాదు మెగాస్టార్ చిరంజీవి దగ్గర కూడా ఎంతో స్వాతంత్ర్యంగా తిరిగే అమ్మాయి కావడంతో ఆమె విషయంలో ఎవరూ ఎటువంటి ఒత్తిడి చేయడం లేదని గతంలో టాక్ వినిపించింది.

సినిమాల నుంచి తప్పుకుందట

సినిమాల నుంచి తప్పుకుందట

నిహారిక తెలుగులో ‘ఒక మనసు', ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఇవేమీ ఆమెకు హిట్ అందించలేకపోయాయి. దీంతో ఆమె సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తన పెదనాన్న చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి' మినహా మరే సినిమాలోనూ ఆమె నటించడం లేదు. అయితే, తన సొంత బ్యానర్‌ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై వెబ్‌ సిరీస్‌లు తీస్తుందని అంటున్నారు.

నాగబాబు మాట్లాడింది ఎవరి కోసమంటే..

నాగబాబు మాట్లాడింది ఎవరి కోసమంటే..

ఇటీవల నాగబాబు హైదరాబాద్‌లోని ఓ పారిశ్రామికవేత్తతో పెళ్లి సంబంధం మాట్లాడాడని ప్రచారం జరుగుతోంది. ఇది నిహారిక కోసం కాదట.. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కోసం అని తెలిసింది. అవును.. నిహారిక కొంత సమయం కోరడంతో నాగబాబు ముందు వరుణ్‌కు పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఈ సంబంధం మాట్లాడడానికి వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వరుణ్ చేసిన వ్యాఖ్యలతో బలం

వరుణ్ చేసిన వ్యాఖ్యలతో బలం

గతంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని మీడియా ప్రశ్నిస్తే.. ‘నా పెళ్లికి తొందరేముంది. ప్రభాస్, నితిన్‌ ఇలా చాలా మంది సీనియర్ హీరోలు ఉన్నారు కదా.. రానా బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్లకు పెళ్లైన వెంటనే నేను కూడా చేసుకుంటా' అని సమాధానం చెప్పేవాడు. కానీ, ‘కొద్దిరోజుల క్రితం ‘F2' చేసిన తర్వాత నా మైండ్‌సెట్ మారింది. మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదనున్న నేనే ఈ సినిమా తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నా' అని చేసిన వ్యాఖ్యలతో ఆయన పెళ్లి నిజమేనన్న టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ ఎవరా అమ్మాయి..?

ఇంతకీ ఎవరా అమ్మాయి..?

మెగా బ్రదర్ నాగబాబు పారిశ్రామికవేత్తతో పెళ్లికి సంబంధించిన చర్చలు జరిపారని తెలిసినప్పటి నుంచి ఆయన ఎవరు..? వరుణ్ చేసుకోబోయేది ఎవరిని..? అని మెగా అభిమానులతో పాటు చాలా మందిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

వరుణ్ చేస్తున్న సినిమా

వరుణ్ చేస్తున్న సినిమా

వరుణ్ ప్రస్తుతం ‘వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X