ఆ హీరోతోనా? తెలుగు యాంకర్ లాస్య గురించి షాకింగ్ న్యూస్?
హైదరాబాద్: ఎంటర్టెన్మెంట్ రంగంలో స్టార్ ఇమేజ్, పాపులారిటీ పెరిగుతున్న కొద్దీ అభిమానుల పాలోయింగ్ పెరిగినట్లే..... వారి గురించి రూమర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎవరితో క్లాస్త క్లోజ్ గా ఉన్నా ఎఫైర్ అంటూ అంటగట్టేస్తారు. అఫ్ కోర్స్... ఇందులొ కొన్ని నిజం కూడా కావొచ్చు.
ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్ల జోరు బాగా పెరిగింది. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్లలో వీరికి బాగా డిమాండ్ ఉండటం, మంచి రెమ్యూనరేషన్ వస్తుండటంతో పలువురు ఈ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.
అలా యాంకర్లుగా వచ్చి హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అవకాశాలు అందిపుచ్చుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. అనసూయ, రష్మి, ఉదయభాను వారే ఇందుకు నిదర్శనం. వీరి తర్వాత ఈ మధ్య కాలంలో పలు టీవీ షోలు, ఆడియో ఫంక్షన్లకు యాంకర్ చేస్తూ బాగా పాపులర్ అయింది యాంకర్ లాస్య.

గూగుల్ లో జాబ్ వదిలేసి
యాంకర్ లాస్య ఇంజనీరింగ్ పూర్తి చేసి..గూగుల్‌లో ఉద్యోగం సంపాదించారు. అయితే ఉద్యోగం చేస్తుండగా బుల్లి తెరలో అవకాశం రావడంతో ఉద్యోగం వదలి తనకు ఎంతో ఇష్టమైన ఈ రంగం వైపు వచ్చేశాను అని ఇటీవల మీడియాకు తెలిపారు.

అప్పుడే ఐదేళ్లయింది
బుల్లితెరకు వచ్చి ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయింది. సంథింగ్ స్పెషల్, అంకితం, ఢీ-జూనియర్స్, మొండి మొగుడు- పెంకి పెళ్ళాం వంటి టీవీ షోలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయని ఆమె మీడియాకు తెలిపారు.

ఇప్పుడేం చేస్తోంది?
ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్, గుంటూరు టాకీస్ నిర్మాత కిషోర్ నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. యాంకర్ ఉదయ భాను అంటే ఎంతో ఇష్టం... ఆమె షోలు చూసి ఇన్స్ స్పైర్ అయ్యాను... ఈ రంగంలో తనకు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది అని లాస్య తెలిపారు.

త్వరలో పెళ్లి
త్వరలో పెళ్ళి చేసుకుని ఇల్లాలుగా ఉండాలని అనుకుంటున్నానని, ఎక్కువ కాలం నటిగా, లేదా యాంకర్ గా కొనసాగే ఆలోచన లేదని లాస్య తెలిపారు. పెళ్లయి పిల్లలు పెట్టిన తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ టీవీ, సినిమా రంగంలోకి రావాలనే ఆలోచనలో లాస్య ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ హీరోతో పెళ్లంటూ పుకార్లు, నిజమేనా?
కాగా... లాస్య గురించి ఇండస్ట్రీలో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. యాంకర్ లాస్య, యువ హీరో రాజ్‌తరుణ్‌ను రహస్యంగా వివాహం చేసుకుందనే వార్తలను ప్రచారం చేస్తున్నారు. వినడానికి ఇది నమ్మశక్యంగా మాత్రం లేదు. ఎవరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారో తెలియదు.

మరీ దారుణంగా ...
ఈ పురకార్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే...వీరు ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారని, ఆ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని, అందుకే రహస్యంగా పెళ్లి చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











