కెలికినందుకు అల్లు అరవింద్ పశ్చాతాపం?
హైదరాబాద్: ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటున్న విషయం...మారుతి కి మరో చిత్రం గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ఆఫర్ ఇవ్వటం. అల్లు అరవింద్ లాంటి ప్రతీ చిన్న విషయం కాలుక్యులేట్ చేసి ముందడుగు వేసే నిర్మాత ఇలా సెకండ్ సినిమా ఇస్తాననమే విచిత్రం అంటున్నారు. ఎందుకంటే తమ బ్యానర్ పై మారుతి ఇచ్చిన 'కొత్తజంట' ఫ్లాఫ్ అయ్యింది. అయితే డబ్బులు వచ్చాయని హిట్ అయ్యిందని అల్లు అరవింద్ కితాబు ఇస్తున్నారు. ఈ విషయమై ఇండస్ట్రీలో రకరకాల టాక్ లు మొదలయ్యాయి.
అయితే దీనికి కారణం ... 'కొత్తజంట' షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ కెలికటంతో సినిమా రిజల్ట్ తేడాగా వచ్చిందని అంతటా ప్రచారం జరగింది. దాని నుంచి తప్పించుకోవటానికే అల్లు అరవింద్ ఈ ఆఫర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించాడంటున్నారు. మరి కొంతమంది...మారుతి కెరీర్ కు ఈ సినిమా ఇబ్బందిగా మారిందని, దానికి కారణం తనేనని పశ్చాతాపం తో ఈ ప్రకటన అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా...మారుతి కి ఇంకో సినిమా అంత పెద్ద బ్యానర్ లో రావటం సంతోషించతగ్గ విషయం.

అల్లు అరవింద్ మాట్లాడుతూ... ''ఇంటిల్లిపాదీ కలసి చూసేలా 'కొత్తజంట' తీశాడు మారుతి. అందుకే ప్రేక్షకాదరణ పొందింది. నా దృష్టిలో సినిమాకు డబ్బులొచ్చాయంటే అది విజయవంతమైనట్టే లెక్క. మా చిత్రం విడుదలైన మూడో వారం కూడా మంచి షేర్లు వస్తున్నాయి. శిరీష్‌కి తొలి విజయాన్ని అందించిన మారుతికి గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేసే అవకాశం ఇస్తున్నా'' అన్నారు .
అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'కొత్తజంట'. అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించారు. మారుతి దర్శకుడు. బన్ని వాస్ నిర్మాత. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి ఆదివారంతో 25 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ''నా గత చిత్రాలకి భిన్నంగా రూపొందిన సినిమా ఇది. ఒక మంచి కథతో అందరికీ నచ్చే సినిమా తీయాలనుకొన్నా. ఆ ప్రయత్నం ఫలించినందుకు ఆనందంగా ఉంది''అన్నారు. ''తొలి విజయాన్ని ఆస్వాదిస్తున్నా. 'కొత్తజంట' ఒక నటుడిగా నాపై బాధ్యతను పెంచింది. ఇక నుంచి మరిన్ని మంచి సినిమాలు చేస్తా'' అన్నారు అల్లు శిరీష్.


Click it and Unblock the Notifications











