'ఈ రోజుల్లో' డైరక్టర్ నెక్స్ట్ ఆ యంగ్ హీరోతో
అంతా కొత్త వాళ్లతో అతి తక్కువ బడ్జెట్ తో తీసి హిట్ కొట్టిన చిత్రం ఈ రోజుల్లో. మారుతి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం రేపింది. చాలా మంది నిర్మాతలు మారుతిని తమకో సినిమాని చేసిపెట్టమని అడుగుతున్నట్లు సమాచారం. తాజాగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ దర్శకుడుతో చిత్రం చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. మరో ప్రక్క నితిన్ సైతం రీసెంట్ గా ఇష్క్ సినిమాతో హిట్ కొట్టి తన తదపరి చిత్రంతో దాన్ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇక ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ అలా మొదలైంది దర్శకురాలితో సిద్దార్ధ హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ సూపర్ హిట్ హింది చిత్రం ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అలాగే మరోప్రక్క కందిరీగ తో హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఇదే బ్యానర్ లో ఓ చిత్రం రూపొందనుంది. అది కందిరీగ సీక్వెల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వీటి తర్వాత బెల్లంకొండ సురేష్ ..లారెన్స్ కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తారు. దానికి సంభందించి స్క్ర్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











