'పక్కా కమర్షియల్' హోం వర్క్.. బిజీబిజీగా మారుతి!

లౌక్యం సినిమా హిట్ కొట్టిన తర్వాత గోపీచంద్ మరో హిట్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా ఆయనకు సరైన హిట్ పడలేదు.. ఆయన సిటీ మార్ అనే సినిమా చేయగా ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఆయన కబడ్డీ కోచ్ గా కనిపిస్తున్నాడు. ఇక మరోపక్క ఆయన దర్శకుడు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది.. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది.

అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ కూడా అన్ని సినిమాల లానే కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. అయితే ముందు అక్టోబరు ఒకటో తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.. కానీ సెకండ్ కారణంగా ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో మారుతి ఇప్పుడు స్క్రిప్ట్ మీద మళ్లీ కూర్చున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు ముప్పావు వంతు షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు మిగిలిన స్క్రిప్ట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే అంశం మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Maruthi Fine tuning Pakka Commercial script

చివరిగా సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండుగ అనే సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న మారుతి తర్వాత కరోనా కారణంగా ఎవరితో సినిమా ప్రకటించలేదు. ఒకరిద్దరు స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేస్తాడని ప్రచారం జరిగినా చివరికి గోపీచంద్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్న మారుతి తనకు ఖాళీ దొరికినా ఈ సమయంలో మరో సినిమా కథ రాసుకోవడానికి వాడకుండా ఇదే స్క్రిప్ట్ మీద మళ్ళీ కూర్చుని ఫైన్ ట్యూన్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. దీంతో కచ్చితంగా తమ హీరో ఈసారీ హిట్ కొట్టి తీరతాడని గోపీచంద్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X