అనుకున్నంత అయ్యింది..మారుతిని వద్దనుకున్నారు
హైదరాబాద్ : కొత్త జంట ప్రభావం మారుతిపై బాగా పడినట్లుంది. అంతకు ముందు అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. కొత్త జంట విడుదల అయ్యాక నితిన్ తో చిత్రం అనుకుని ఆ మేరకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. నితిన్ సొంత ప్రొడక్షన్ లో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్టు ప్రారంభం స్టేజీలోనే ఆగిపోయిందని తెలుస్తోంది. దానికి తోడు మారుతి చిన్న లో బడ్జెట్ చిత్రాలకే సరిపోతాడని,కొంచెం పెద్దవైతే ఇలా భాక్సాఫీస్ వద్ద భడేలమంటాయని టాక్ బయిలు దేరింది. అయితే ఒక్క సినిమా ఫెయిల్యూర్ కే ఇలా టాక్ పుట్టించటం అనేది అన్యాయమే అయినా అది ఖచ్చితంగా అతని కెరీర్ పై ప్రభావం చూపుతుంది. నితిన్ తో ప్రాజెక్టు ఉండి ఉంటే మారుతి సేఫ్ జోన్ లో ఉన్నట్లే లెక్క.
అందులోనూ వెంకటేష్ తో హడావిడిగా మొదలైన రాధ ప్రాజెక్టు అర్దాంతరంగా ఆగిపోవటం కూడా మారుతికి మైనస్ అయ్యింది. ఎదిగే సమయంలో ఇది పెద్ద దెబ్బే. ఇప్పుడు నితిన్ ప్రాజెక్టు కూడా నిజంగా వెనక్కి వెళ్ళటం జరిగితే మారుతికి అగ్ని పరీక్షే. ఇప్పుడు మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుని కాని మరో హీరో దగ్గరకి వెళ్లలేని పరిస్ధితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తాము ఇంతకు ముందు హిట్ ఇచ్చిన హీరో దగ్గరకు వెళ్లి దర్శకులు లబ్ది పొందటానికి ప్రయత్నిస్తూంటారు. అంటే తాను ప్రేమ కధా చిత్రంతో హిట్ ఇచ్చిన సుధీర్ బాబు దగ్గరకి మళ్లీ మారుతి వెళ్లతాడా అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారిన అంశం.

మరో ప్రక్క అదేం లేదు..ఈ చిత్రంలో మారుతి తన మసాలాని వదిలేసాడు. అందుకే పోయింది. ఈ సారి మళ్లీ ఈరోజుల్లో, బస్ స్టాఫ్ వంటి సినిమాతో వస్తాడు. ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతాడు అంటున్నారు. అయితే మారుతి తన నెక్ట్స్ ప్రాజెక్టు ఏంటన్నది ఇప్పటివరకూ ప్రకటించలేదు. తన వద్ద పది సంవత్సరాల వరకూ కథలు ఉన్నాయని చెప్పిన ఆయన ఈ పాటికి హీరోల వేటలో ఉండే ఉంటారంటున్నారు.కొత్త జంట హిట్ అయితే హీరోలు ..మారుతి కోసం తిరిగేవారు..ఇప్పుడు మారుతి వారి డేట్స్ కోసం తిరగాలి అంతే తేడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











