మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరింది
హైదరాబాద్ : మారుతి మరో చిత్రం మొదలెట్టారు. అంతా కొత్త వారితో రూపొందే ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి నేల-బెంచి-బాల్కనీ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. సైలెంట్ గా ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం టైటిల్, పూర్తి డిటేల్స్ తో మీడియాకు తెలియచేస్తారని తెలుస్తోంది.
ఇక మారుతి కి కొత్త జంట ఎఫెక్టు బాగానే పడింది. అంతకు ముందు అనుకున్న ప్రాజెక్టులు కాన్సిల్ అయ్యాయి. కొత్త జంట విడుదల అయ్యాక నితిన్ తో చిత్రం అనుకుని ఆ మేరకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. నితిన్ సొంత ప్రొడక్షన్ లో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్టు ప్రారంభం స్టేజీలోనే ఆగిపోయింది. అలాగే ఆ తర్వాత సునీల్ తో చిత్రం అనుకున్నారు. అదీ మెటీరియలైజ్ కాలేదు.

దానికి తోడు మారుతి చిన్న లో బడ్జెట్ చిత్రాలకే సరిపోతాడని,కొంచెం పెద్దవైతే ఇలా భాక్సాఫీస్ వద్ద భడేలమంటాయని టాక్ బయిలు దేరింది. అయితే ఒక్క సినిమా ఫెయిల్యూర్ కే ఇలా టాక్ పుట్టించటం అనేది అన్యాయమే అయినా అది ఖచ్చితంగా అతని కెరీర్ పై ప్రభావం చూపుతుంది. అందుకే మరోసారి కొత్తవారితో ఈ చిత్రం ప్రారంభించినట్లు చెప్తున్నారు.
మరో ప్రక్క అదేం లేదు..ఈ చిత్రంలో మారుతి తన మసాలాని వదిలేసాడు. అందుకే పోయింది. ఈ సారి మళ్లీ ఈరోజుల్లో, బస్ స్టాఫ్ వంటి సినిమాతో వస్తాడు. ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతాడు అంటున్నారు. అయితే మారుతి తన నెక్ట్స్ ప్రాజెక్టు ఏంటన్నది ఇప్పటివరకూ ప్రకటించలేదు. తన వద్ద పది సంవత్సరాల వరకూ కథలు ఉన్నాయని చెప్పిన ఆయన ఈ పాటికి హీరోల వేటలో ఉండే ఉంటారంటున్నారు.కొత్త జంట హిట్ అయితే హీరోలు ..మారుతి కోసం తిరిగేవారు..ఇప్పుడు మారుతి వారి డేట్స్ కోసం తిరగాలి అంతే తేడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











