బాంబ్ పేల్చాడు :హిట్టైన సీన్స్ నేను డైరక్ట్ చేసినవే
హైదరాబాద్ : ఈ పాయింట్ అనుకున్నప్పుడే సప్తగిరి క్యారెక్టర్ అనుకున్నాను. ఆ తర్వాత ఈ షూటింగ్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా నేను వెళ్లి ఆ కామెడీ సీన్స్ ను డైరక్ట్ చేసా. సప్తగరి పిచ్చోడి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని షూట్ చేసేటప్పుడే అనుకున్నాను అన్నారు మారుతి. ఇటీవలే విడుదలైన లవర్స్ చిత్రం హిట్ టాక్ తో దూసుకువెళ్తోంది. ఈ చిత్రంలో సప్తగిరి కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా ఆయనో సినిమా పత్రికతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే దర్శకుడు హరి గురించి మాట్లాడుతూ... హరి క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ పాయింట్ చెప్పినప్పుడే తనలోని కాన్ఫిడెన్స్ ని గమనించాను. ఇక ఈ సినిమా బాగానే తెరకెక్కించినప్పటికీ సప్తగిరి కామెడీ సీన్స్ మాత్రం నేను డైరక్ట్ చేయటం జరిగింది. ఇక మిగతా భాగం అంతా తను బాగా తెరకెక్కించాడు.

ఇక గతంలోనూ ప్రేమ కథా చిత్రం విడుదల తర్వాత మారుతి ఆ చిత్రం తనే డైరక్ట్ చేసానని రివిల్ చేసారు. ఇప్పుడు ఈ చిత్రం లో పేలిన సప్తగిరి ట్రాక్ ని తనే డైరక్ట్ చేసానని చెప్పారు. ఆయన చెప్పిన విషయం నిజమా కాదా అన్నది ప్రక్కన పెడితే...ఆయన మాటల ప్రభావం ఖచ్చితంగా ఆ దర్శకుల కెరీర్ మీద పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇక ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అంటున్నారు. ప్రేమ కధా చిత్రం దర్శకుడుకి ఇప్పటికీ ఇంకో సినిమా ప్రారంభం కాలేదు అన్న విషయం తెలిసిందే. మారుతీకే ఆ హిట్ క్రెడిట్ వెళ్ళిపోవటంతో అదే మైనస్ గా మారిందనేది ఇండస్ట్రీ టాక్.
ఇవన్నీ ఎలా ఉన్నా..మారుతి అనే బ్రాండ్ లేకపోతే ఈ చిత్రానికి ఇంత ఓపినింగ్స్ రావు...ఆ ఓపినింగ్స్ ని బేస్ చేసుకుని వచ్చిన కలెక్షన్స్ ఉండవు అనేది కూడా ఆలోంచిచాల్సిన నిజం.


Click it and Unblock the Notifications











