‘ఇదిగో పులి...అదిగో పులి’ ఎక్కడయ్యా బాబు ‘పులి’..!?
'మర్యాద రామన్న"తో మరోసారి జనం మెచ్చిన సినిమాని తీసిన రాజమౌళికి తొలివారంలో అందుకు తగ్గట్టే కనకాభిషేకం జరిగింది. వరుసగా ఎనిమిదో విజయాన్ని సాధించిన ఆనందంలో ఉన్న రాజమౌళి ఇంకా ఆ విజయానందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాడు. ఆ విజయ దరహాసాన్నిసంపూర్ణంగా చిందించలేకపోతున్నాడు. 'మర్యాద రామన్న" హిట్టయినా కూడా ఇంకా ఎక్కడో ఓ గుబులు రాజమౌళిని వీడడంలేదు.
'మర్యాద రామన్న" ప్రేక్షకుల నుంచి మరో మూడు వారాల పాటు మర్యాద తగ్గకుండా నెగ్గుకు రాగలిగితే గానీ పంపిణీదారులు పెట్టిన మొత్తం తిరిగి రాదనేది ఓ అంచనా. అయితే అది జరగాలంటే 'మర్యాద రామన్న" కి అన్ని రోజుల పాటు ఎలాంటి పెద్ద అడ్డంకులు ఎదురు కాకూడదు. కానీ పరిస్థితి మాత్రం అందుకు సానుకూలంగా కనిపించట్లేదు.
ఆగస్టు 6న వస్తున్న 'డాన్ శీను" ఖచ్చితంగా ప్రేక్షకులని ఆకర్షించడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేడు. అయితే 'డాన్ శీను" ధాటిని తట్టుకుని నిలబడినా కానీ తర్వాత రాబోయే 'కొమరం పులి" మాత్రం మార్కెట్ లో ఉన్న సినిమాలకి సీరియస్ త్రెట్ కావడం ఖాయమంటున్నారు. అయితే పులి ఇంతదాకా రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఖరారు చేయకపోవడం ఒక్కటీ 'మర్యాద రామన్న" బయ్యర్లకి ఊరటనిస్తోంది. కానీ 'అదిగో పులి..ఇదిగో పులి" అనే బెదిరింపులు మాత్రం వారిని కుదురుండనీయడం లేదు. మర్యాద రామన్న" సేఫ్ జోన్ లోకి చేరే వరకు 'కొమరం పులి" కనికరిస్తుందో, లేక ముందే వచ్చి దాని భయాన్ని నిజం చేస్తుందో..ఇదంతా కాక 'మర్యాద రామన్న" అనవసరంగా భయపడ్డాడని తేల్చేస్తుందో చూద్దాం.


Click it and Unblock the Notifications











