ప్చ్ ...రామ్ 'మసాలా' రిలీజ్ మళ్లీ వాయిదా

By Srikanya

హైదరాబాద్ : విజయభాస్కర్‌.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మసాలా' మళ్లీ వాయిదా పడింది. ఎన్నో వాయిదాలు అనంతరం నవంబర్ 1 అంటే దీపావళి కి విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే థియోటర్ సమస్యలతో మళ్లీ ఈ చిత్రాన్ని నవంబర్ 14కి వాయిదా వేసినట్లు సమాచారం. హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా రూపొందుతోంది. వెంకటేష్‌, రామ్‌ గా నటిస్తున్నారు. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌ నిర్మాతలు. డి.రామానాయుడు సమర్పకులు.

చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఇంగ్లిష్‌లో మాట్లాడాలనే తపన ప్రదర్శించే ఓ పెద్దమనిషి... ప్రేమ కబుర్లు చెప్పి అల్లరి చేసే ఓ కుర్రాడు... వీరిద్దరి మధ్య సాగే ఓ సరదా కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే. కథని నమ్మి ఈ సినిమాను చేశాం. 'మసాలా' నిజంగా ఒక రుచికరమైన సినిమా అవుతుంది. చాలా వేగంగా చిత్రాన్ని పూర్తి చేశాం. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొంటారు అన్నారు. ఇటీవల 'మసాలా మసాలా' అని సాగే ఓ గీతాన్ని తెరకెక్కించారు. శంకర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తయింది.

వెంకటేష్ మాట్లాడుతూ... ''మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వినోదం, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యమున్న సినిమాలు ఇటీవల చక్కటి ఫలితాల్ని సాధిస్తున్నాయి. మా చిత్రం కూడా అదే తరహాలో ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉండబోతోంది. 'విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' చిత్రాల్లో నటించాను. ఇప్పుడు మూడోసారి ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. రామ్‌ కీలకమైన పాత్రలో నటించాడు. తన సినీ జీవితంలో ఇదొక మంచి పాత్ర అవుతుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. తమన్‌ చక్కటి బాణీల్ని సమకూర్చాడు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు .

రామ్‌ మాట్లాడుతూ ''నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు 'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమా తీశారు. మద్రాసులో సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నప్పుడు నేను సెట్‌కి వెళ్లేవాణ్ని. మళ్లీ అదే బృందం కలిసి పనిచేసిన ఈ సినిమాలో ఇప్పుడు నేను భాగం కావడం ఓ ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. వెంకటేష్‌గారితో కలిసి నటించడం ఎంతో సంతృప్తినిచ్చింది. చిత్రసీమకు నాలుగు మూల స్తంభాలుంటే అందులో ఒకరు వెంకటేష్‌. కథ, కథనాలపై నమ్మకంతో ఈ సినిమా చేశాం'' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''సరికొత్త రుచులను పంచే మసాలా ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. వెంకటేష్‌, రామ్‌లు కలిసి చేసే సందడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందనవస్తోంది''అన్నారు. అలీ, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్‌.ఎస్‌.నారాయణ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆండ్రూ, సంగీతం: తమన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X