Don't Miss!
- Sports
INDvsNZ : తొలి టీ20 ముందు టీమిండియాకు బూస్ట్.. డ్రెస్సింగ్ రూంలో లెజెండ్!
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఆ రచయిత నుంచి ఏకంగా 5 కథలు కొనేసిన రవితేజ.. డిజాస్టర్ వచ్చినా ఇచ్చిన మాట తప్పలేదు..
మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో లాక్ డౌన్ తర్వాత మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తరువాత అదే తరహాలో మరో విజయాన్ని అందుకోలేకపోయారు. క్రాక్ సినిమాతో ఎంత వేగంగా భారీ విజయాన్ని అందుకున్నాడో అంతే వేగంగా ఖిలాడి సినిమాతో ఊహించని డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో మాస్ రాజా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అడుగులు వేస్తున్నాడు. రవితేజ నుంచి నెక్స్ట్ రాబోయే రామారావు ఆన్ డ్యూటీ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. అలాగే ధమాకా సినిమాపై కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఒక టాలెంటెడ్ రైటర్ నుంచి రవితేజ ఏకంగా ఐదు కథలను ఒకేసారి కొనేసినట్లుగా తెలుస్తోంది. ఆ కాన్సెప్ట్ లు అన్నీ కూడా బాగా నచ్చడంతో రవితేజ మరో ఆలోచన లేకుండా రచయితకి మొత్తంగా ఒక భారీ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆ రైటర్ మరెవరో కాదు ఖిలాడి సినిమాకు రైటర్ గా పని చేసినటువంటి శ్రీకాంత్ అని తెలుస్తోంది. అప్పట్లోనే ఆ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ తో రవితేజకు విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ ఈవెంట్ లో రవితేజ దర్శకుడిపై కామెంట్స్ చేయకుండా పూర్తిగా ఆ రచయితపైనే పాజిటివ్ గా స్పందించడం విశేషం.
అంతే కాకుండా అతని కారణంగానే సినిమా బాగా వచ్చింది అని కూడా తెలియజేశాడు. ఇక ఆ రచయిత తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా కొనసాగుతాడు అని రవితేజ తెలియజేశాడు. అప్పుడు అన్నట్లుగానే రవితేజ రచయితకు ఒక మంచి అమౌంట్ ఇచ్చే అతని దగ్గర ఉన్న ఐదు కథలను కొన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ప్రాజెక్ట్ ల స్క్రిప్ట్ డెవలప్ వర్క్స్ లో కూడా శ్రీకాంత్ వర్క్ చేస్తే మరింత ఎక్కువ ఆదాయం అందే అవకాశం ఉందట. ఇక రవితేజ దిల్ రాజు ప్రొడక్షన్లో ఇటీవల ఒక సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసినట్లు సమాచారం. యాంకర్ ప్రదీప్ తో ఆ మధ్య '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా డైరెక్ట్ చేసిన మున్నా ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.