SS Rajamouli: మహేశ్ కోసం విలన్‌గా మారనున్న టాలీవుడ్ స్టార్ హీరో... జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా!

ప్రపంచవ్యాప్తంగా సినీలవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ఒకటి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు.. భారతీయ సినిమా ఇండస్ట్రి సత్తాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి రాజమౌళి. అలాంటి వ్యక్తి తీయబోయే సినిమాపై భారీ అంచనాలు ఉండటం సహజం. అయితే ఇప్పుడు మహేశ్ బాబు, రాజమౌళి సినిమా నుంచి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో చేయబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ హీరో ఎవరు.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎస్ఎస్ రాజమౌళి... ఈ పేరే ఓ బ్రాండ్. ఆ సినిమాలో హీరో ఎవరు.. హీరోయిన్ ఎవరు అనేది ప్రేక్షకులు చూడరు.. సినిమా మాత్రం చూసేస్తారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చవి చూడని దర్శకుడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాలు అంటే కమర్షియల్ మాత్రమే అనుకున్న వారికి.. ఆస్కార్ అవార్డు తీసుకువచ్చి సమాధానం చెప్పిన ధీరుడు రాజమౌళి.

Mass Maharaja Raviteja as Villain For Mahesh Babu SS Rajamouli Movie News Goes Viral

మరి అలాంటి వ్యక్తి తీయబోయే సినిమాపై భారీ అంచనాలు ఉండటం సహజం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి.. మహేశ్ తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ కాంబో కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ వచ్చినా చాలు అనుకుంటున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా..? అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

అయితే మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక పలు మార్లు వాయిదా పడుతూ.. నెమ్మదిగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mass Maharaja Raviteja as Villain For Mahesh Babu SS Rajamouli Movie News Goes Viral

ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు కసరత్తులు మొదలు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. మరి అవి రాజమౌళి సినిమా కోసమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి మహేశ్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటించనున్నారట. మహేశ్ బాబు కోసం ఆ క్రేజీ స్టార్ ను రాజమౌళి విలన్ గా మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి సినిమాలో హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో.. విలన్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాడు. అలాంటి రోల్ కోసం మాస్ రాజా రవితేజను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో విక్రమార్కుడు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విలన్ గా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ క్రుయాలిటీ పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X