5 అవతారాల్లో...మాస్ మహారాజ్ రవితేజ!
మాస్ మహారాజ్ రవితేజ సినిమాలంటే కామెడీ, పంచ్ డైలాగులు తప్పనిసరి. వాటికి తోడు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాడు ఈ హీరో. అయితే త్వరలో రవితేజ తన నైజానికి భిన్నంగా తెరపై కనబడబోతున్నారు. ఇది ఒకరకంగా రవితేజఎక్స్‌పర్ మెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో రవితేజ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా ఐదు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
గతంలో శౌర్యం సినిమాకు దర్శకత్వం వహించి శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని సమాచారం. కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ స్టఫ్ తో ఈ సినిమా రూపొందబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన తాప్సీని లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రవితేజ ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిప్పు' సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. దీక్షాసేథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి నిర్మాత.


Click it and Unblock the Notifications











