ఎన్టీఆర్,పూరీ సినిమా: అప్పుడే రచ్చ?
హైదరాబాద్ : సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే ఈ చిత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ అద్బుతం...కెవ్వు కేక...హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అంటూ వార్తలు మొదలైపోతున్నాయంటే అర్దం ఏంటి...ఎవరో పని గట్టుకుని సినిమాకు క్రేజ్ తేవటానికి ప్రచారం చేస్తున్నట్లుగే. తాజాగా పూరీ, ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఈ చిత్రం ఇంటర్వెల్ మామూలుగా ఉండదంటూ మీడియాలో మోగిపోతోంది. ఇది కావాలని ఓ స్టాటజీ ప్రకారం చేస్తున్న పబ్లిసిటీనా లేక నిజంగానే స్క్రిప్టు లీకైందా అనే సందేహాలు సిని అభిమానులకు కలుగుతున్నాయి.
ఎన్.టి.ఆర్ , పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా సెట్స్ పైన ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వక్కంతం వంశీ ఈ సినిమా కోసం చాలా కొత్త కథని అందిస్తే, దానికి పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించారు.

ఇక రేపటి నుంచి ఎన్.టి.ఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరవేరుది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











