బాలయ్య హ్యాండ్ ఇచ్చాడు.. మరో క్రేజీ ఛాన్స్.. లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి!

ఎన్టీఆర్ జీవిత చరిత్రపై అనేక చిత్రాలు రూపొందుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఎన్టీఆర్ సినీరంగ విశేషాలతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అభిమానులకు సంతృప్తినివ్వకపోయినా బాలయ్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్రిబ్రవరి 7న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని విడుదుల చేయనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వివాదాల దర్శకుడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంలో వాస్తవాలు చూపిస్తాను అంటూ సంచలనం సృష్టిస్తున్నాడు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన హాట్ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

లక్ష్మీ పార్వతి ఎవరు

లక్ష్మీ పార్వతి ఎవరు

బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం క్లారిటీ రావడం లేదు. అసలు ఈ చిత్రంలో ఆమె పాత్ర ఉందా లేదా అనే విషయం కూడా తెలియడం లేదు. కానీ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, కేతిరెడ్డి తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ వీరగ్రంధం చిత్రంలో మాత్రం లక్ష్మి పార్వతి పాత్ర ప్రధానంగా ఉండబోతోంది.

 హామీ ఇచ్చిన తేజ

హామీ ఇచ్చిన తేజ

బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రారంభమైనప్పుడు మొదటగా తేజని దర్శకుడిగా అనుకున్నారు. ఆ సమయంలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోంది. ఆమెకు అండగా నిలబడిన తేజ తన తెరకెక్కించబోయే 3 చిత్రాల్లో శ్రీరెడ్డికి అవకాశం ఇస్తున్నానని తెలిపారు. శ్రీరెడ్డి ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఎదో ఒక పాత్రలో ఉంటుందని ఉహాగానాలు వినిపించాయి. కానీ ఈ చిత్రం నుంచి తేజ అనూహ్యంగా తప్పుకున్నాడు. బాలయ్య దర్శకత్వ పగ్గాలు క్రిష్‌కి అప్పగించాడు. దీనితో శ్రీరెడ్డికి ఎన్టీఆర్ బయోపిక్ లో అవకాశం దక్కలేదు.

లక్ష్మీపార్వతి పాత్రలో

లక్ష్మీపార్వతి పాత్రలో

బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని పక్కన పెడితే.. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో మీడియా సంచలనం శ్రీరెడ్డి లక్ష్మీపార్వతిగా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష్మి పార్వతి పాత్రకు దర్శకుడు తేజ ప్రమేయంతో శ్రీరెడ్డికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. వివాదాలతో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి.. లక్ష్మి పార్వతి పాత్రలో నటించడం నిజమే అయినా మరో వివాదం మొదలైనట్లే.

ఎన్టీఆర్ జీవితంలోకి

ఎన్టీఆర్ జీవితంలోకి

ఎన్టీఆర్ జీవితం చివరి దశలో ఉన్న సమయంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి పార్వతి కేంద్రంగా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ వివాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో ఆమె పాత్రని చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం విడుదలయ్యాక తేలనుంది. మరోవైపు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తా అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X