బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్.. ఆ ఎపిసోడ్ కోసమే దింపుతున్న డైరెక్టర్!
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణకు గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు. దాదాపు నాలుగైదు సినిమాలు చేసినా ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా ఆయనకు కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో తనకు సింహ, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీనుతో ఆయన సినిమా ప్లాన్ చేశాడు.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అదీకాక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా యధార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర కాగా మరొకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ తో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
యంగ్ హీరోయిన్ గా శృతి హాసన్ ని దర్శకుడు అప్రోచ్ కాగా సీనియర్ హీరోయిన్ గా మీనాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆమె దృశ్యం, దృశ్యం 2 సినిమాలలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయనకు జంటగా మీనా నటించబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మీనాను సంప్రదించారని ఆమె కూడా తన సమ్మతి తెలియజేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ముద్దులమొగుడు, బొబ్బిలు సింహం సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications











