Meenakshi Chaudhary: లక్ తోక తొక్కిన మీనాక్షి చౌదరి... మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్!
హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, నటన, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామకు ఇటీవల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం ఈ బ్యూటీ త్రివిక్రమ్ మహేశ్ బాబు సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో ఆమె ఫేట్ మారిపోయింది. వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. అంతేనా రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. ఇక తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ మీనాక్షి చౌదరి అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. ఈ భామకు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. మీనాక్షి చౌదరి తెలుగులో సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక మొదటి సినిమాతోనే ఈ భామ అందరి చూపును ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజతో కలిసి ఖిలాడి అనే చిత్రం చేసింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

ఇక అడవి శేష్ నటించిన హిట్ 2 చిత్రంలో మీనాక్షి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మీనాక్షికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాతే త్రివిక్రమ్ గుంటూరు కారంలో ఛాన్స్ ఇచ్చాడు. మొదట గుంటురు కారం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో.. మీనాక్షి పంట పండింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ సినిమాతో ఈ భామ ఫేట్ మారిపోయింది.

మీనాక్షి చౌదరి ఎప్పుడైతే గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసిందో.. అప్పుడే ఈ భామకు ఆఫర్లు క్యూ కట్టాయి. వరుస ఆఫర్లు వస్తున్నాయి. గుంటూరు కారం సినిమా కాకుండా మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా ఎంపిక అయింది. అంతే కాదు.. వరుణ్ తేజ్ మట్కా సినిమాలోనూ ఈ భామే హీరోయిన్.. ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా, సింగపూర్ సెలూన్ అనే తమిళ సినిమాలో ఈ భామ ఛాన్సు కొట్టేసింది.
ఇక దళపతి విజయ్ పాన్ ఇండియా చిత్రం 68లోనూ ఈ భామే హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ సినిమాతో ఈ భామ క్రేజ్ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే ఈ భామ మరో పాన్ ఇండియా సినిమా.. కాదు కాదు.. పాన్ వరల్డ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ కు ఓ హీరోయిన్ నచ్చితే... వరుసగా రెండు మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గుంటూరు కారంలో నటిస్తున్న మీనాక్షికి గురూజీ మరో ఛాన్స్ ఇచ్చాడన్నమాట. ఇక ఈ పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో కలిసి ఈ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు.. సంయుక్త మీనన్ కూడా నటించనుందట. ఇక ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











