Guntur karam: మహేశ్ మూవీ నుంచి ఆ హీరోయిన్ ఔట్.. హిట్ బ్యూటీకి బంపర్ ఆఫర్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. హిట్లను సొంతం చేసుకుంటూ.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ సత్తా చాటుతోన్నాడు. గత చిత్రం ఆశించిన రీతిలో ఆడకపోవడంతో ఇప్పుడు కచ్చితంగా కొట్టాలన్న కసితో 'గుంటూరు కారం' చేస్తున్నాడు.

దాదాపు పుష్కర కాలం తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని బ్రేకులు రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, నేటి నుంచి చిత్రీకరణ పున: ప్రారంభం కాబోతుంది.

 Meenakshi Chaudhary Key Role in Guntur karam Movie

వాస్తవానికి 'గుంటూరు కారం' మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఆ తర్వాత ఇందులో శ్రీలీలను కూడా భాగం చేశారు. అయితే, ఈమె పాత్ర సెకెండ్ లీడ్‌ హీరోయిన్‌గానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇప్పుడు పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, శ్రీలీలనే ఈ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా ఫైనల్ చేశారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ న్యూస్ లీకైంది.

కుటుంబ కథతో రాబోతున్న 'గుంటూరు కారం' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చిత్ర యూనిట్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ లీడ్ అవడంతో రెండో హీరోయిన్‌ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'హిట్' మూవీ మీనాక్షి చౌదరిని సెకెండ్ లీడ్ రోల్ కోసం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని అంటున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న ఈ బ్యూటీకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

 Meenakshi Chaudhary Key Role in Guntur karam Movie

'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. కానీ, ఇది మారే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X