తెలుగు సినిమాలో తమిళ హీరోతో మీనాక్షి రొమాన్స్.. క్రేజీ కాంబో ఫిక్స్!
టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన కెరీర్‌ను స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటోంది. తాజాగా తమిళ స్టార్ హీరో సరసన మరో భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటీ?
మీనాక్షి చౌదరి.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. తన అందం, కాన్ఫిడెన్స్‌తో బ్యూటీ పేజెంట్స్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మెరిసి, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవడం ఆమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఆ ఫేమ్‌తోనే సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. మొదట్లో మోడలింగ్ ప్రపంచంలో రాణించిన ఆమె, తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

తెలుగులో 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మీనాక్షి చౌదరి, ఆ తరువాత HIT: The Second Caseలో హీరో అడవి శేష్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో కనిపించి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత ఖిలాడీ, కొలై వంటి చిత్రాల్లో నటిస్తూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తన గుర్తింపును పెంచుకుంది. అంతే కాదు.. లక్కీ భాస్కర్ తో హిట్ తో స్టార్ హీరోయిన్ గా మారారు. గతేడాది వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అలరించింది. ఈ సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు' సినిమాతో వచ్చి, ఎంటర్టైన్ చేసింది.ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తుంది.
తాజాగా.. తమిళ హీరోతో మీనాక్షి రొమాన్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే.. కార్తితో ఆమె చేయబోతున్న కొత్త సినిమా. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇప్పుడు కార్తితో ఓ లవ్ అండ్ ఎంటర్టైనర్ స్టోరీని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి బైలింగ్వల్‌గా రూపొందనుంది. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇక సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తికి జోడీగా మీనాక్షి చౌదరి నటించనుందట. ముఖ్యంగా కార్తి - మీనాక్షి జోడీ ఫ్రెష్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ చాలా ఎంటర్టైనర్ గా , ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ స్టైల్‌కు తగ్గట్లుగా కామెడీ, ఎమోషన్, రొమాన్స్ మిక్స్ చేసిన ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా మీనాక్షి చౌదరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఐదోసారి పనిచేయడం విశేషంగా మారింది.
ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో ఆమె గుంటూరు కారం, లక్కీ భాస్కర్, అనగనగా ఒక రాజు వంటి ప్రాజెక్టుల్లో నటించింది. అలాగే ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్‌లో కూడా లీడ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఒకే బ్యానర్‌లో వరుస అవకాశాలు రావడం అంటే ఆమెపై నిర్మాత సూర్యదేవర నాగవంశీకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.
ఇక హీరో కార్తి విషయానికి వస్తే, తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఆవారా, ఖాకీ వంటి చిత్రాలు తెలుగులో ఘన విజయం సాధించాయి. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి ద్వారా స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఈ కొత్త చిత్రం ఆయనకు తెలుగులో రెండో స్ట్రెయిట్ మూవీగా నిలవనుంది. ప్రస్తుతం కార్తి 'సర్దార్ 2' పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉండగా, మరోవైపు మార్షల్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య కొత్త ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది


Click it and Unblock the Notifications





