పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి వల్గర్ ఈమెయిల్స్ తో హరాస్ మెంట్...
పవన్ కళ్యాణ్ సినిమా 'బంగారం"తో తెలుగుతెరకి పరిచయమైన మీరా చోప్రా ఆ తర్వాత 'వాన", 'మారో" చిత్రాల్లోనూ నటించింది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించిన మీరా చోప్రా త్వరలో తన చిరకాల స్నేహితుడిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే గత ఆరు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనని ఇంటర్నెట్ లోనూ, ఫోన్లు చేసి వేధిస్తున్నాడట.
అతను తనకి దారుణమైన ఈమెయిల్స్ పంపిస్తుండేవాడని, తన ఫియాన్సేకి కూడా బెదిరింపు మెయిల్స్ పంపించేవాడని, దాంతో పోలీసులకి కంప్లయింట్ ఇవ్వగా వారు ఐపీ అడ్రస్ ద్వారా అతడిని పట్టుకున్నారనీ మీరా చోప్రా చెప్పింది. ఆరు నెలల పాటు అతను పెట్టిన టార్చర్ తలచుకుంటేనే కాళ్లు, చేతులు వణుకుతున్నాయని, అతని వల్ల తన పెళ్లి కూడా ఆగిపోయే పరిస్థితి తలెత్తిందని మీరా చోప్రా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











