పవన్ హీరోయిన్ తో నాగార్జున సరసాలు

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మీరా చోప్రా గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా నాగార్జున సరసన నటించబోతోందని సమాచారం. నాగార్జున తాజా చిత్రం భాయ్ లోకి ఆమెను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. మొదటి హీరోయిన్ గా రిచాగంగోపాధ్యాయని తీసుకున్నారు.

ఓ కేసు కారణంగా ఆ మధ్య సినిమాలకు దూరం అయిన అమ్మడు తాజాగా మళ్లీ అవకాశాల కోసం దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతోంది. బంగారం సినిమా పరాజయం పాలైనప్పటికీ...ఆ తర్వాత మీరా నటించిన 'వాన' సినిమా మోస్తరు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక నితిన్ తో నటించిన 'మారో' చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. మరి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న ఆమెకు విజయం వరిస్తుందో లేదో చూడాలి.

ఆ మధ్యన హైదరాబాద్ లో కనిపించిన ఆమెను మీడియా వారు ప్రశ్నించగా....సినిమా చేయడం లేదని ఎవరు అన్నారు, ఇతర భాషా చిత్రాల్లో బిజీగా ఉన్నానని, తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానను, ప్రస్తుతం రెండు సినిమాలు ఓకే అయ్యేలా ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.

అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుందన్నారు. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని వీరభద్రం చౌదరి తెలిపారు. తన గత రెండు చిత్రాలకంటే అద్భుతంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X