twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరా జాస్మిన్ రీ ఎంట్రీ పక్కా? హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్లీ.. రామ్ పోతినేని సినిమాలో అలా!

    |

    చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలతో చస్తున్నా.. అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్ లోని ఈ పాట వింటే బ్యూటీఫుల్ మీరా జాస్మిన్ గుర్తుకురాకా మానదు. బ్యూటిఫుల్ మీరా జాస్మిన్ చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం మరిచిపోలేని క్రేజ్ సంపాదించుకుంది. ఒకప్పుడు హోమ్లీ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ ఇటీవల మాత్రం గేర్ మార్చి హాట్ గా అందాలు ప్రదర్శిస్తోంది. ఇదంతా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే అని రూమర్స్ వచ్చాయి. అయితే ఇదంతా ఇప్పుడు నిజమని తెలుస్తోంది. మీరా జాస్మిన్ త్వరలో తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

    అందుకే వరుసగా ఆఫర్లు..

    అందుకే వరుసగా ఆఫర్లు..

    మలయాళీ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ తనదైన అందం, చందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 2004 సంవత్సరంలో శివాజీ హీరోగా చేసిన అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది మీరా జాస్మిన్. ఆ సినిమాలో ఎంతో పద్ధతిగా అందంగా కనిపించిన మీరా జాస్మిన్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే మాస్ మహరాజా రవితేజ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భద్ర సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ.

    ఎంతో పద్ధతిగా కనిపించి..

    ఎంతో పద్ధతిగా కనిపించి..

    బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన భద్ర సినిమాలో మీరా జాస్మిన్ అందం, అభినయంతో పాటు, డ్యాన్స్ లతో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో మీరా జాస్మిన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ సరసన పందెం కోడి సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమాలో కూడా ఎంతో పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది మీరా జాస్మిన్.

    చిన్న హీరోలతో చేస్తూ..

    చిన్న హీరోలతో చేస్తూ..


    భద్ర, పందెం కోడి సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమాలో జోడి కట్టింది మలయాళి భామ మీరా జాస్మిన్. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. సినిమాకు ఆశించిన విజయం దక్కకపోయిన మీరా జాస్మిన్ కు మాత్రం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే అప్పటివరకు పెద్ద హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటిఫుల్ సుందరి తర్వాత చిన్న హీరోలతో నటించింది. పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేసి అలరించింది మీరా జాస్మిన్.

    హోమ్లీగా కనిపించిన మీరా..

    హోమ్లీగా కనిపించిన మీరా..

    పెద్ద పెద్ద కళ్లతో హోమ్లీగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది మీరా జాస్మిన్. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటించి కూడా ఎంతో ఆకట్టుకుంది. అన్నా చెల్లెల్లుగా వీరిద్దరి కాంబినేషన్ ఎంతో బాగుందని ప్రశంసలు కూడా వచ్చాయి. మీరా జాస్మిన్ తెలుగులో రారాజు (2006), ఆకాశ రామన్న, అ ఆ ఇ ఈ, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, యమగోల మళ్లీ మొదలైంది, మహారథి వంటి చిత్రాల్లో నటించింది.

    దుబాయి ఇంజినీర్ తో పెళ్లి..

    దుబాయి ఇంజినీర్ తో పెళ్లి..

    అలాగే తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అయిన యువ సినిమాలో కూడా మీరా జాస్మిన్ నటన ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక చివరిగా 2013లో మోక్ష అనే సినిమాలో కనిపించింది మీరా జాస్మిన్. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. 2014 సంవత్సరంలో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లాడి దుబాయ్ వెళ్లిపోయింది. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చేసింది.

     డబ్బింగ్ ఫొటో వైరల్..

    డబ్బింగ్ ఫొటో వైరల్..

    విడాకుల తర్వాత మరింత ఫిట్ గా తయారై సోషల్ మీడియాలో తెగ హాట్ ట్రీట్ ఇచ్చేసింది ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. ఆమె తన హాట్ ఫొటోలతో నెటిజన్లు మతులు పోగొట్టింది. అయితే ఇదంతా సినిమాల్లో రీ ఎంట్రీ కోసమే అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా నిజమని వార్తలు వినిపిస్తున్నాయి. మీరా జాస్మిన్ త్వరలో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇందుకు కారణం ఆమె తాజాగా డబ్బింగ్ చెబుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే.

    RAPO20 సినిమాలో..

    RAPO20 సినిమాలో..

    ఇక మీరా జాస్మిన్ తనకు సూపర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబినేషన్ లో RAPO20 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ మీరా జాస్మిన్ నటిస్తోన్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు రామ్ పోతినేని సినిమాలో కనిపించనుందని సమాచారం. మరి ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనుందని క్యూరియాసిటీ నెలకొంది.

    English summary
    Senior Heroine Meera Jasmine Re Entry In Tollywood With Boyapati Srinu Ram Pothineni Combination Movie RAPO20 And Dubbing Photo Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X