క్రేజీ హీరోయిన్‌తో బోయపాటి మరో ప్రయోగం.. 17 ఏళ్ళ తర్వాత సెట్టవుతున్న కాంబో?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మాస్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బోయపాటి శ్రీనివాస్ ఇటీవల అఖండ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తో ఇదివరకే సింహా లెజెండ్ సినిమాలతో ఒక సరి కొత్త ట్రెండ్ సెట్ చేసిన బోయపాటి మూడవసారి అఖండ సినిమాతో అంతకు మించి అనేలా విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని దర్శకుడు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాకుండా సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్టుగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరొక హీరో గా అల్లు అర్జున్ కూడా కనిపించబోతున్నట్లు కాస్త హింట్ అయితే ఇచ్చాడు. ఇక ఏదైనా జరగవచ్చు అని బోయపాటి శ్రీనివాస్ అఖండ మల్టీస్టారర్ అని చెప్పకనే చెప్పేశాడు.
అయితే అఖండ సినిమా విజయం తో బోయపాటి స్థాయి మరో లెవెల్ కు పెరిగింది. ఆ తరువాత అతను ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా బోయపాటి తదుపరి సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు కూడా పెంచుకుంటున్నారు అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని తో కూడా బోయపాటి ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నాడు. అసలైతే రెండేళ్ల క్రితమే ఈ కాంబినేషన్ సెట్ అవ్వాల్సిందే. కానీ రామ్ ఖాళీగా ఉన్నప్పుడు బోయపాటి బిజీగా ఉంటున్నాడు బోయపాటి ఖాళీగా ఉన్నప్పుడు రామ్ బిజీగా ఉంటున్నాడు. వీరికి సరైన టైం దొరకడం లేదు.

ఇక వీరి ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియదు గానీ రామ్ పోతినేని కి సంబంధించిన సినిమాలో బోయపాటి మీరాజాస్మిన్ ను కూడా ఒక పవర్ఫుల్ పాత్ర కోసమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీరాజాస్మిన్ బోయపాటి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భద్ర లో హీరోయిన్ గా కనిపించిన విషయం తెలిసిందే. 2005 లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ 17 ఏళ్ల అనంతరం బోయపాటి ఆమెను డైరెక్ట్ చేయబోతున్నట్లు గా సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు మీరా జాస్మిన్ కూడా మళ్ళీ సినిమాలతో సెకంస్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ తన తదుపరి సినిమాకు సంబంధించిన రెండు ప్రాజెక్టుల కథలను పవర్ఫుల్గా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందు ఎవరితో చేస్తారు అనే విషయంలో కూడా బోయపాటి క్లారిటీ కి రాలేదు. రామ్ పోతినేని తో వర్క్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అఖండ సీక్వెల్ అయితే వెంటనే చేయకూడదు అని బోయపాటికి నిర్మాత సూచించినట్లు టాక్. ఆ ప్రాజెక్టు కథకు ఇంకా కొంత సమయం కూడా పడుతుందట. అందుకే ఆ లోపు బోయపాటి రామ్ పోతినేని తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











