»   »  ఆఫర్స్ లేకే..మీరాజాస్మిన్ వేశ్యగా?

ఆఫర్స్ లేకే..మీరాజాస్మిన్ వేశ్యగా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meera Jasmine
మళయాళ పరిశ్రమ నుండి మీరా జాస్మిన్ బ్యాన్ ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె వచ్చిన ప్రతీ ఆఫర్ ని ఒప్పుకోవాలనే నిర్ణయంతో ముందుకు వెళ్తోందని తాజా సంఘటనులు రుజువుచేస్తున్నాయి.తాజాగా ఆమె కన్నడంలో నిర్మిస్తున్న ఓ ఆఫ్ బీట్ చిత్రంలో వేశ్య పాత్రలో జీవించటానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరు “Ijjodu". స్క్రిప్టు ప్రకారం ఆమె ఇద్దరు మగవాళ్ళతో ఒకే సారి ప్రక్కను పంచుకోవటం ,అర్ధనగ్నంగా కనపడటం చేయాలట. అయినా మీరా కాదనకుండా ఒప్పుకోవటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

అసలు ఇంతకు ముందు మీరా జాస్మిన్ తను చేయబోయే ప్రతీ సినిమా కథనీ తన దైన దృష్టితో పరిశీలించి నిర్ణయం తీసుకునేది. దాంతో కొందరు దర్శక,నిర్మాతలు ఆమెను దూరంగా పెట్టారు. అయితేనేం ఆమె మెరుగైన నటనతో.. సెలక్టివ్ గా కొన్ని పాత్రలు చేసే అవార్డులు,రివార్డులు పొందటంతో డిమాండు తగ్గలేదు. అయితే ప్రస్తుత పరిస్ధితులు ఆమెకు అనుకూలంగా లేవు. దాంతో ఆమె తమిళ,తెలుగులో సంగీత చేస్తున్న కనకం తరహా వేశ్య కథతో వచ్చిన ఈ కన్నడ సినిమా ఒప్పుకుంది. అయితే ఇంతకు ముందామె ఇలాంటి ఆఫర్స్ ఒప్పుకునే ముందు ఆలోచించేది. ఇప్పడు మాత్రం కథ కూడా పూర్తిగా వినకండా పచ్చ జెండా ఊపటానికి కారణం ఆఫర్స్ తగ్గటమేనని చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X