మీరా జాస్మిన్..బర్త్ కంట్రోల్ పిల్స్??
జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత మీరా జాస్మిన్ గత నెల రోజులుగా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నట్లుగా సమాచారం.ఆ పిల్స్ ని అనవసర ప్రెగ్నెన్సీ రాకుండా ఆపటానికి వినియోగిస్తారు.వివాహం కాకుండా వాటితో ఏం పని అంటూ ఈ విషయం తెలిసిన మీడియా అంతా గగ్గోలెత్తింది. ఈ విషయమై మళయాళ పత్రిక వారు ఆమెతో మాట్లాడి కన్ఫర్మ్ చేసామంటూ రాసుకొచ్చారు. అయితే మీరా ఈ పిల్స్ ని ప్రెగ్నిస్నీ కోసం వాడటం లేదని చెప్తున్నారు. ఆమెకు ధైరాయడ్ గ్లాండ్ సమస్య రావటంతో ట్రీట్ మెంట్ నిమిత్తం తీసుకునే మందులతో పాటు వీటినీ ఆమె తీసుకోవాలని వైద్యులు సూచించారుట.అలా చేస్తే వండర్స్ జరుగుతాయని మూడు నెలల లోపే ధైరాయడ్ సమస్య పరిష్కారమవుతుందని వాడిస్తున్నారని ఆ పత్రక రాసుకొచ్చింది.ఇక ఆమె నటించిన అఆఇఈ చిత్రం త్వరలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే నరేష్ ప్రక్కన చేసిన ఆకాశరామన్న చిత్రం కూడా విడుదలకోసం వెయిట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











