Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
ఇటీవలే తన 151వ సినిమా 'సైరా నరసింహా రెడ్డి'తో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమా మెగా 152 కోసం రెడీ అయ్యారు. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయి. కాగా తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవి లుక్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ లుక్ లోనే కొరటాల మూవీలో చిరు కనిపించనున్నారని అంటున్నారు. వివరాల్లోకి పోతే..
మెగా 152.. ఎప్పటిలాగే కొరటాల శివ
మెగా 152 సినిమా కోసం అతి త్వరలో కొరటాల శివ సెట్స్ పైకి రానున్నారు మెగాస్టార్ చిరంజీవి. సామాజిక అంశాలను ఎలివేట్ చేయడంలో దిట్ట అయిన కొరటాల శివ.. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం బలమైన, ఆసక్తికరమైన కథాంశంతో స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఇటీవలే స్టార్ట్ అయింది.
రెగ్యులర్ షూట్‌కి ముహూర్తం
మరోవైపు తాజా సమాచారం మేరకు మెగా 152 డిసెంబర్ నాలుగో వారంలో రెగ్యులర్ షూట్‌కి వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తికాగానే షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే వేసవికల్లా సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
మెగా 152 బ్లాక్ బస్టర్కి ఇదే పునాది
ఈ పరిస్థితుల నడుమ చిరు- కొరటాల సినిమాలో మెగాస్టార్ లుక్ ఇదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చిరంజీవి ఒత్తైన మీసకట్టుతో వైట్ డ్రెస్‌లో సూపర్‌గా ఉన్నారు. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం చిగురించింది. ఈ లుక్ చూసి మెగా 152 బ్లాక్ బస్టర్కి ఇదే పునాది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిరు కెరీర్ లోనే స్పెషల్ మూవీ
ఈ సినిమా కథాంశం దేవాలయాల నేపథ్యంలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసే ఆఫీసర్‌గా చిరు నటించబోతున్నారట. అందుకే స్టైలిష్ లుక్ కోసం చిరంజీవి కసరత్తులు చేశారని, చిరు కెరీర్ లోనే స్పెషల్ మూవీగా మెగా 152 చరిత్ర సృష్టించనుందని టాక్.
చిరంజీవి రోల్.. ఆ హీరోయిన్‌తో రొమాన్స్
ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లేడీ అమితాబ్ విజయశాంతి కూడా ఇందులో భాగం కానుందని అంటున్నారు. మెగాస్టార్‌కి సరిసమానంగా ఆమె కోసం ఓ ముఖ్యపాత్ర డిజైన్ చేశారట కొరటాల. ఇక చిత్రంలో చిరంజీవి సరసన త్రిష ఫైనల్ అయిందని టాక్ నడుస్తోంది.