Mega158: చిరంజీవికి జోడీగా ప్రపంచ సుందరి.. దిమ్మతిరిగే ప్లానింగ్‌తో బాబీ!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)వరుస సినిమాలతో తన ఫుల్ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి రేసు లో గట్టి పోటీ ఇవ్వబోతున్నారని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఇదిలా ఉంటే.. చిరంజీవి తరువాత చేయబోయే 158వ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లీ (Bobby Kolli)తెరకెక్కిస్తుండటంతో, అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. కారణం... ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడమే.

Mega 158ను రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ ( KVN Productions)బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మెగాస్టార్ మాస్ ఇమేజ్‌ను కొత్త లెవల్‌లో చూపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి ఇప్పటివరకు చేయని ఓ కొత్త షేడ్‌లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. కథలో స్ట్రాంగ్ ఎమోషన్‌తో పాటు పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉండేలా బాబీ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Mega 158 Chiranjeevi-Bobby Kolli Film Buzz Aishwarya Rai Mohanlal amp amp AR Rahman Rumours

ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే... ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారన్న టాక్ చాలా రోజులుగా నడుస్తోంది. మొదట తమిళ స్టార్ కార్తీ పేరు వినిపించగా, ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal)పేరు వినిపిస్తోంది. మోహన్ లాల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే.. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ చిత్రంలో భాగం అవుతారని ప్రచారం సాగుతోంది.

ఇక టెక్నికల్ టీమ్ విషయంలో కూడా Mega 158కు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్న టాక్ ఉంది. మాలీవుడ్ టాప్ డీఓపీ నిమిష్ రవి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ భారీ రూమర్లు వినిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రహమాన్ ( A. R. Rahman) ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని టాక్,

ఇలా ఎన్నో అంచనాల మధ్య ఇప్పుడు Mega 158కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో పెద్ద బజ్... బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) పేరు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటించనున్నారన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అయితే ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపిస్తారా? లేక అతిథి పాత్రలోనా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.

గతంలో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఐశ్వర్య రాయ్ అతిథి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అయితే, ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉండనుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఆమె పేరును సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం, అన్నీ అనుకూలిస్తే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాక్.

ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో ముందుగా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ (Venkatesh) గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం మరో ఆకర్షణగా మారింది. ఈ సినిమా విడుదలైన తర్వాతే చిరంజీవి పూర్తిగా Mega 158పై ఫోకస్ పెట్టనున్నారట. మొత్తం మీద మెగా 158 విషయంలో వినిపిస్తున్న రూమర్లు, స్టార్ క్యాస్టింగ్, భారీ టెక్నికల్ టీమ్, బాబీ కొత్త కాన్సెప్ట్ అన్ని ఈ సినిమాను మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X