మెగాస్టార్ మూవీలో సూపర్ స్టార్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బాబీ

Mega 158 Movie: మన శంకర వరప్రసాద్ గారుతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చాటారు. ఇప్పటికే ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి చిరంజీవి కెరీర్‌లో భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ తదుపరి ప్రాజెక్టులపై పూర్తి ఫోకస్ పెట్టారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు బాబీ కొల్లీ (Bobby Kolli)తో ఆయన రెండోసారి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్ అంటే అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టించింది. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెరకెక్కుతున్న 'మెగా 158'పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం.

Mega 158 Movie Chiranjeevi-Bobby Kolli Film to Feature Mohanlal in Powerful Police Role

ఈ సినిమాకు సంబంధించి ఓ అప్టేట్ చర్చనీయాంశంగా మారింది. అదే మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ (Mohanlal) పాత్రే. తాజా బజ్ ప్రకారం, మోహన్ లాల్ ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. ఇది కేవలం కామియో రోల్ మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రగా ఉంటుందని టాక్. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ ఎవరూ ఊహించని రీతిలో ఉండబోతోందని టాక్. చిరంజీవి- మోహన్ లాల్ వంటి ఇద్దరు లెజెండరీ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా మారనుంది.

ఇక కథాంశం విషయానికి వస్తే.. 'మెగా 158'లో తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతుందని సమాచారం. చిరంజీవి తన కెరీర్‌లో తొలిసారిగా పూర్తిస్థాయి తండ్రి పాత్రలో కనిపించనున్నారట. మాస్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాల్ని మేళవిస్తూ కథను నడిపించాలని బాబీ కొల్లి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ పల్స్‌ను బాగా అర్థం చేసుకున్న బాబీ, ఈసారి మెగాస్టార్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

హీరోయిన్‌గా జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి పేరు వినిపిస్తోంది. చిరంజీవి సరసన ఆమె తొలిసారి నటిస్తుండటంతో ఈ కొత్త జోడీపై ఆసక్తి నెలకొంది. అలాగే కూతురు పాత్ర కోసం శ్రీలీల, కృతి శెట్టి, అనస్వర రాజన్ వంటి యంగ్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ నటుడు అనురాగ్ కాశ్యప్ విలన్ పాత్రలో కనిపించనున్నారన్న టాక్ కూడా సినిమాపై హైప్‌ను పెంచుతోంది.

ఈ మూవీకి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనుండగా, కెవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అలాగే.. మూవీకి 'కాకా' అనే మాస్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా 'మెగా 158' కేవలం మరో మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, చిరంజీవి-మోహన్ లాల్ కలయికతో ఈ సినిమాను డైరెక్టర్ బాబీ ..పాన్-ఇండియాగా మార్చాలని భావిస్తున్నట్టు, ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్న ప్రాజెక్ట్‌గా మారుతోంది.

More from Filmibeat

Read more about: bobby kolli chiranjeevi mohanlal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X