మెగా క్లాష్ : రామ్ చరణ్-పవన్ కళ్యాణ్ రిలీజ్ వార్

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం టైటిల్ 'అత్తారింటికి దారేది' అని ఖరారు చేసి, ఆగస్టు 7 న విడుదల చేస్తున్నామని ప్రెస్ నోట్ విడుదల చేసారు దర్శక,నిర్మాతలు. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ ఎవడు చిత్రం రిలీజ్ కు ...పవన్ చిత్రానికి మధ్య గ్యాప్ లేకుండా పోయింది. రామ్ చరణ్ ఎవడు చిత్రం జూలై 31 కి వస్తుందటున్నారు. దాంతో వారం గ్యాప్ లో ఇద్దరు మెగా హీరోలు రిలీజ్ లతో దూకుతూండటంతో రిలీజ్ వార్ లో థియోటర్స్ సమస్య వచ్చేటట్లు ఉంది.

ఇప్పుడు రామ్ చరణ్ రిలీజ్ డేట్ మారుస్తాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. రెండు పెద్ద సినిమాలు కావటంతో సమస్య తప్పదంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కు విపరీతమైన క్రేజ్ ఉండటంతో మినిమం రెండు వారాలు పాటు థియోటర్స్ మొదటే బుక్కైపోతాయి. కలెక్షన్స్ ఓ రేంజిలో ఉంటాయి. చరణ్ సినిమాలకూ అదే పరిస్ధితి మెల్లిగా ఏర్పడుతోంది. ఈ నేపధ్యంలో ఈ వార్ ని ఎలా తప్పించాలా అని సినీ పెద్దలు ఆలోచనలో పడుతున్నారు.

ఇక సమంత చెప్పిందే నిజమైంది. పవన్‌ కల్యాణ్‌ సినిమాకు 'అత్తారింటికి దారేది' అని పేరు పెట్టారని ముందుగా చెప్పింది ఆమే. పవన్‌ సినిమాకు అంత క్లాస్‌ టైటిల్‌ నప్పదని, మారే అవకాశాలున్నాయని అనుకొన్నారు. కానీ యూనిట్ కూడా ఈ టైటిల్‌కే ఓటేసింది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత, ప్రణీత హీరోయిన్స్ . ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే పేరు ఖరారు చేశారు.

ప్రస్తుతం పవన్‌, హంసానందిని, ముంతాజ్‌లపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ''కుటుంబ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రం ఇది. 'అత్తారింటికి దారేది' పేరు సరిగ్గా నప్పుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందరినీ ఆకట్టుకొంటాయి. వచ్చే వారంలో పాటల్ని విడుదల చేస్తామ''న్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, కళ: రవీందర్‌, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X