Ayodhya Ram Mandir ఆహ్వానం అందినా అయోధ్యకు ఉపాసన ఎందుకు వెళ్లలేదంటే - కారణమిదే?
జగమంతా సంబరంలా, భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం(జనవరి 22) అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సం వేడుకగా జరిగింది. దీంతో 'జై శ్రీరామ్' నినాదాలతో దేశావ్యాప్తంగా వీధులన్నీ మార్మోగిపోయాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు కూడా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చేరుకుని రామూడి దర్శనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్‌తో పాటు కలిసి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి చరణ్ భార్య ఉపాసన ఎందుకు హాజరు కాలేదో కారణం తెలిసింది. వివరాల్లోకి వెళితే..
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. చిరు భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లి బాలరాముడిని సందర్శించారు.

అయితే రామ్ చరణ్ అయోధ్యకు వెళ్లారు కానీ ఆయన భార్య ఉపాసన మాత్రం వెళ్లలేదు. దీంతో ఎందుకు ఉపాసన అయోధ్యకు వెళ్లలేదు? రామ్ చరణ్ ఒక్కడే ఎందుకు హాజరయ్యారు అనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే దీనికి కారణం కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. ఉపాసన తన కూతురు క్లీంకారాని తీసుకొని అంత దూరం జర్నీ చేయడం రిస్క్ అనుకుని భావించిందట. అంత మంది జనాల మధ్య క్లింకార ఇన్ఫెక్షన్కు గురౌతుందని డాక్టర్స్ హెచ్చరించడంతోనే ఆమె అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లలేదని తెలిసింది. వాస్తవానికి ముందు నుంచే ఈ కార్యక్రమానికి వెళ్లాలని ఉపాసన చాలా ఆశగా ఉండిందట. కానీ క్లింకారాను చూసుకోవడానికి ఆగిపోయిందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

రామ్‌చరణ్ ఏమన్నారంటే : అయోధ్య రామమందిరం బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుత.. అయోధ్య రామమందిరం అద్భుతం. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. ఈ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించడం ప్రతి ఒక్కరికీ గౌరవం అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేర్కొన్నారు.
"రాముడి దీవెనల కోసం అయోధ్యకు వచ్చాను. ఇది ఎంతో అందమైన అనుభూతి ఇది. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే గొప్ప అపూర్వ ఘట్టం ఇది. ఇలాంటి అద్భుతమైన ఘటాన్ని చూడటం ప్రతిఒక్కరికి గొప్ప గౌరవం లాంటిది. భారత దేశంలో పుట్టి ఇలాంటి గొప్ప సంఘటనకు సాక్షిగా నిలవడాన్ని నాకు లభించిన గొప్ప వరంగా భావిస్తున్నాను" అని చరణ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











