ఆచార్య సినిమాలో నిహారిక క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే?

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో అయినా మంచి కమర్షియల్ బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ డిఫరెంట్ షేడ్స్ తో ఆచార్య సినిమాలో దర్శనమివ్వనున్నారట. ఇకపోతే సినిమాలో పాత్రలకు సంబంధించిన రూమర్స్ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి.

రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. నటీనటులు ఎవరో ఒకరు భయటపెడుతున్నారే గాని ప్రొడక్షన్ హౌజ్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక దర్శకుడు కొరటాల అయితే పెద్దగా రెస్పాన్డ్ కావడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ అలాగే నిహారిక స్పెషల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే.

Mega daughter niharika acharya movie character details

రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడో తెలియదు గాని మెగా డాటర్ నిహారిక మాత్రం రామ్ చరణ్ కి సోదరిగా కనిపించనుందట. అంటే రియల్ లైఫ్ లో ఉన్నట్లుగా అల్లరి చెల్లిగానే కాకుండా ఆమె పాత్ర కొంత ఎమోషనల్ గా కూడా ఉంటుందని సమాచారం. ఇదివరకే సైరా సినిమాలో ఒక గిరిజన యువతిగా కనిపించిన మెగా డాటర్ మరోసారి పెదనాన్న, అన్నయ్యలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. మరి ఆ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X