Niharika Chaitanya Wedding Cost: నిహారిక డివొర్స్ వల్ల నాగబాబు అన్ని కోట్లు నష్టపోయారా?
మెగాడాటర్ నిహారిక విడాకుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా మరో వార్త షికార్లు కొడుతోంది. నిహారిక డివొర్స్ వల్ల ఆమె తండ్రి నాగబాబు ఎన్నో కోట్లు నష్టపోయారట. ఆ వివరాలు..
మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కు కూతురు పుట్టిన శుభవార్త అలా అందిందో లేదో.. అంతలోనే ఆ కుటుంబం నుంచి మరో నెగటివ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే నిహారిక విడాకులు. నిజానికి ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న ఆమె తన భర్త చైతన్య జొన్నల గడ్డతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

చివరికి అదే నిజమవుతూ అధికార ప్రకటన వచ్చింది. తాజాగా ఆమె.. తాను డివొర్స్ తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో చాలామంది మెగా అభిమానులు కాస్త బాధపడ్డారు. అంతేకాకుండా మరి కొంతమంది నిహారికను విమర్శించారు కూడా.
అందుకే విడాకులు: నిహారిక.. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడం వల్ల వారి కల్చర్ మరోలా ఉంటుంది. అందుకే ఆమె.. చైతన్య జొన్నల్లగడ్డ కుటుంబంతో కలవలేకపోయింది అని అంటున్నారు. మరోవైపు.. ఆమె ఎక్కువగా పార్టీలు, పబ్బులు, వెకేషన్ అండ్ ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ గడిపేదంటూ..
అత్తవారింటి సంప్రదాయాలు, కట్టుబాట్లకు ఆమె అలవాటు పడలేకపోయేదని వాదనలు వినిపిస్తున్నాయి. అలా ఇలాంటి పరిణమాల వల్ల చైతన్య- ఆమెకు మధ్య మనస్ఫర్థలు వచ్చాయని, అందుకే కలిసి బతకలేక పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని తెలిసింది. ఇక కూతురు మాటలను అర్థం చేసుకుని నటుడు నాగబాబుకు ఈ డివొర్స్ కు అంగీకారం తెలిపారట.

రూ.50కోట్ల ఖర్చుతో: అయితే ఈ విడాకుల వ్యవహారం గురించి అధికార ప్రకటన వచ్చినప్పటి నుంచి.. నిహారిక పెళ్లికి సంబంధించిన ఖర్చు గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వివాహ వేడుక చాలా గ్రాండ్ గా రాజస్థాన్ జైపుర్ ప్యాలెస్ వేదికగా జరిగింది.ఈ పెళ్లికి దాదాపు రూ. 50 కోట్ల వరకు నాగబాబు ఖర్చు చేశారని అంటున్నారు.
మరి ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి పెళ్లి చేసినప్పటికీ.. ఆ బంధం గట్టిగా మూడేళ్లు కూడా భర్తతో కలిసి ఉండలేక పోయిందని చెప్పుకుంటున్నారు. నాగబాబుకు రూ.50కోట్లు నష్టం అని కామెంట్లు పెడుతున్నారు. ఇక నాగబాబు కూడా కూతురు మీద ప్రేమతో ఆమె భవిష్యత్త్ ను దృష్టిలో ఉంచుకుని విడాకులకు ఒప్పుకున్నారట.

ఒక్క రూపాయికి కూడా నో: ఇకపోతే మరో విషయం కూడా నెట్టింట్లో ట్రెండ్ అయింది. అదేంటంటే నిహారిక భరణం కింద రూ.100 కోట్ల వరకు అడిగిందని వార్తలు వచ్చాయి. కానీ నిహారిక మాత్రం తన భర్త నుంచి భరణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిసింది. తన కాళ్లపై తాను బతకాలని నిర్ణయించుకుందట.


Click it and Unblock the Notifications











