Niharika Konidela: మాజీ భర్త చైతన్యను కలవబోతున్న నిహారిక... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల కొన్నాళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇక వీరి విడాకుల ప్రకటనతో సంచలనం సృష్టించింది. ఇక వీరి విడాకులకు కారణాలు ఏమిటి అనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ లేదు. కానీ వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారని ప్రచారం అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు వీరు మళ్లీ ఎందుకు కలవబోతున్నారు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెగా డాటర్ నిహారిక ముందు యాంకర్ గా బుల్లితెరపై షో చేసింది. ఆ తర్వాత నటిగా కొన్ని సినిమాలు చేసింది. అయితే అవి వర్కౌట్ కాకపోవడంతో నిర్మాతగా మారి వెబ్ సిరీసులు, సినిమాలు నిర్మిస్తోంది. అయితే ఆమెకు ఒక పోలీస్ అధికారి కుమారుడైన జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వీరి వివాహం రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా చాలా గ్రాండ్ గా జరిపించారు.

అప్పట్లో మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్ కు సంబంధించిన ఎంతోమంది ఆ వివాహానికి హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కోర్టుకు వెళ్లి అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు.ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని మేరకు నిహారిక జొన్నలగడ్డ చైతన్య మళ్ళీ కలవబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇది కలిసి కాపురం చేసుకోవడానికి కాదు.
అసలు విషయం ఏమిటంటే... వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒక స్థలాన్ని ఇద్దరు డబ్బులతో కొనుగోలు చేశారట. ఇప్పుడు విడిపోయిన నేపథ్యంలో ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టారని తెలుస్తోంది. ఆ స్థలం ఇద్దరి పేరు మీద ఉండడంతో.. ఇద్దరు సైన్ చేస్తే కానీ ఆ స్థలానికి అమ్మే అర్హత ఉండదని అంటున్నారు. ఆ కారణంగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నిహారిక జొన్నలగడ్,డ చైతన్య మళ్ళీ కలవబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

నిహారిక ముందు సంతకం చేసిన తర్వాత జొన్నలగడ్డ చైతన్య సంతకం చేసి ఆ ప్రాపర్టీని సేల్ చేస్తారనీ.. ఆ ప్రాపర్టీ మీద వచ్చిన డబ్బులు కూడా ఇద్దరు సమానంగా పంచుకుంటారని అంటున్నారు. నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ కూడా ఈ మధ్యనే ప్రేమించి లావణ్య త్రిపాఠిన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు చాలాకాలం నుంచి ప్రేమలో ఉండగా ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
ఇటలీలో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. కేవలం మెగా కుటుంబానికి చెందిన హీరోలు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాదు వచ్చి ఒక పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసి మెగా అభిమానులను టాలీవుడ్ పెద్దలను ఆహ్వానించి భారీ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు నిహారిక తన సినిమాలతో బిజీగా తన లైఫ్ తాను జీవిస్తుంది. ఇక జోన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం సాగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.


Click it and Unblock the Notifications











