చిరు, నాగబాబుకు చెప్పేసిన నిహారిక: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

మెగా డాటర్ నిహారిక సినిమాల్లో కనిపించకూడదని సంచలన నిర్ణయం తీసుకుందా..? ఈ విషయాన్ని ఆమె తన తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవికి కూడా చెప్పేసిందా..? వాళ్ల నుంచి కూడా ఆమెకు మద్దతు లభించిందా..? కొణెదల నిహారిక సినిమాల్లో చేయకపోయినా.. మినీ స్ర్కీన్‌పై కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ దాదాపుగా అవుననే సమాధానం వినిపిస్తోంది.

బుల్లితెరపై యాంకర్‌గా మెప్పించిన నిహారిక కొణెదల.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసింది. 'ఒక మనసు', 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఇవేమీ ఆమెకు హిట్ అందించలేకపోయాయి. ఈ మూడు సినిమాలూ ఆమెతో పాటు మెగా అభిమానులనూ నిరాశ పరిచాయి. దీంతో నిహారిక సినిమా రంగానికి గుడ్‌బై చెప్పాలని భావిస్తుందట. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు సైతం ధృవీకరిస్తున్నారు.

తాను సినిమాల్లో నటించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని తండ్రి నాగబాబుతో పాటు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవికి సైతం చెప్పిందని సమాచారం. ఈ విషయంలో వాళ్లిద్దరూ నిహారిక నిర్ణయాన్ని స్వాగతించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్‌లో ఎలాంటి ప్రయత్నం చేసినా తమ మద్దతు ఉంటుందని వాళ్లు హామీ ఇచ్చారట. దీంతో నిహారిక సినిమాలను మానేసి, వెబ్ సిరీస్‌ల మీద దృష్టి పెట్టాలని ఆలోచిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Mega Daughter Niharika Konidela not interest to act movies

నిహారిక సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకోవాలని ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమె గతంలోనే సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'ను ప్రారంభించింది. దీని ద్వారానే 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇవి సూపర్ హిట్ అయ్యాయి. ఈ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ, నిహారిక సినిమాల్లో ఎంటర్ అవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

సినిమాల్లో తన లక్ బాగోకపోవడంతో ఇప్పుడు 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' ద్వారా మరిన్ని వెబ్ సిరీస్‌లు చేయాలని నిర్ణయించుకుందట నిహారిక. ఇందుకోసం ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్స్ కూడా విన్నదని తెలుస్తోంది. వీలైతే తాను నటించాలని, లేకుంటే వేరే వాళ్లను పెట్టి నిర్మాతగా వ్యవహరించాలని ఈ మెగా డాటర్ భావిస్తుందని ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X