For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా అభిమానులకు నిహారిక తీపి కబురు.. సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం!

  |

  మెగా డాటర్ నిహారిక కొణిదెల గత కొద్ది రోజుల క్రితం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఒక పబ్ మీద రైడింగ్ జరిగిన సమయంలో ఆమె పబ్ లోనే ఉండడంతో ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ కూడా అనేక వార్తా కథనాలు బయటికి వచ్చాయి. నిజానికి డ్రగ్స్ ఆమె తీసుకోలేదు కానీ డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి, అయితే తాజాగా ఆమె మరోసారి వార్తలోకి ఎక్కారు. అయితే ఈసారి మాత్రం మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  నిలదొక్కుకోలేక

  నిలదొక్కుకోలేక

  మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగు ఆడియన్స్ కి సుపరిచితం. పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఆమె తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒక సూపర్ క్రేజ్ ఉన్న హీరోల కుటుంబం నుంచి వచ్చిన నటి కాబట్టి గ్లామరస్ రోల్స్ జోలికి వెళ్లకుండా తనకు తగ్గ పాత్రలు మాత్రమే చేస్తూ వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

  సోషల్ మీడియా వేదికగా

  సోషల్ మీడియా వేదికగా


  ఆ తర్వాత నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు నిర్మించింది. అలాగే తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక చిన్నపాటి పాత్రలో కూడా కనిపించింది. ఇటీవల డ్రగ్స్ కేసులో నిహారిక పబ్బులో కనిపించడంతో ఆమె మీద అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తిన వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్త నుంచి విడిపోయినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ షేర్ చేసుకుంటూ ఉండేవారు.

  ముగ్గురం అంటూ

  ముగ్గురం అంటూ

  అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ కావడం తగ్గించడంతో వీరి గురించి కూడా అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే తరువాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో అవి నిరాధారమైన పుకార్లే అని తేలిపోయాయి. అయితే ఇప్పుడు ఆమె తల్లి కాబోతున్నట్లుగా కొత్తగా ప్రచారం మొదలైంది. నిహారిక తాను తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని తన స్నేహితులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. మా లైఫ్ లోకి మరొకరు ఇకపై మేము ముగ్గురం అంటూ నిహారిక వారికి చెప్పినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

  సన్నిహితులకు మాత్రమే

  సన్నిహితులకు మాత్రమే

  అయితే ఇలాంటి సంతోషకరమైన విషయాన్ని ఆమె కేవలం సన్నిహితుల వరకే చెప్పి ఊరుకుంటున్నారా , అంటే నిజమే అనలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి సంతోషకరమైన విషయాన్ని ఆమె మెగా అభిమానులు అందరితో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది కానీ ఇలా కేవలం సన్నిహితులకు మాత్రమే చెప్పి ఊరుకోదని అంటున్నారు.

  వార్త నిజమైతే

  వార్త నిజమైతే

  బహుశా ఈ వార్తను నిజం కాకపోయి ఉండవచ్చని నిజంగా ఏదైనా ఉంటే నాగబాబు అయినా సరే తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించి ఉండేవారని వారు అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది మెగా అభిమానులు అయితే ఏదైతేనేం ఆ వార్త నిజమైతే మంచి విషయమే కదా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  mega daughter niharika pregnancy news viral in social media. but no official announcement came regarding this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X