Niharika : షాకింగ్... ఇల్లు వదిలి వెళ్తున్న నిహారిక.. లావణ్య త్రిపాఠితో విభేదాలా? అసలు నిజమిదే!
మెగా డాటర్, ఆ ఫ్యామిలీ ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సినిమా కన్నా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతోనే హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఫ్రీడమ్ గర్ల్‌గా ఎప్పుడూ లైఫ్‌ను చిల్ కొడుతూ కనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడీమే తన ఇంటిని వదిలి వెళ్లి పోబోతుందని తెలిసింది. కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ఉండబోతుందట. అందుకు గల కారణం తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి..
ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తెగా నిహారిక అందరికీ సుపరిచితురాలే. మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన అమ్మాయి ఈమెనే. ఒక మనసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలతో అలరించింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ అతిథి పాత్రలో మెరిసింది. కానీ ఈమె హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఓటీటీల్లో వెబ్‌సిరీస్‌లతో అలరించేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ మధ్య విడాకుల తర్వాత డెడ్ పిక్సల్ చేసింది. అది పర్వాలేదనిపించింది.

పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి మూడునాళ్ల ముచ్చటైంది. ఇద్దరు వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా మారిపోయారు. ఇక ఇటీవల పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక విడాకులు తీసుకున్న దశ తనకెంతో క్లిష్టమైన దశ అని చెప్పుకువచ్చింది. బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు చెప్పింది.
ఇకపోతే నిహారిక డివొర్స్ తీసుకోగానే తన అన్న వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గ్రాండ్‌గా జరిగింది. అయితే ప్రస్తుతం నిహారిక తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. కానీ త్వరలోనే నిహారిక వేరే ఇంటికి షిఫ్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. లావణ్యతో కాస్త మనస్పర్థలు వచ్చాయని అందుకే వెళ్తుందని అన్నారు. కానీ అది నిజం కాదని తెలిసింది. ఎందుకంటే వీరిద్దరు మంచి స్నేహితులు. వరుణ్ తేజ్ తో పెళ్లికి ముందు నుంచే లావణ్య.. నిహారికతో స్నేహం చేసింది.

అలానే తాను ఎందుకు షిఫ్ట్ అవ్వబోతుందో క్లారిటీ కూడా ఇచ్చింది నిహారిక. తనకు ఒంటరిగా ఉండడమే చాలా ఇష్టమని చెప్పింది. నాకు ప్రత్యేకంగా ఓ ఇల్లు ఉండాలని అనుకున్నాను. ఆ ఇంటిని నిర్మించడానికి కావాల్సిన డబ్బులను కూడా సొంతంగా సంపాదించుకున్నాను. డబ్బులు సరిపోకపోతే నా తండ్రి దగ్గర అప్పుగా తీసుకుని మరీ కట్టించుకుంటున్నానని ఆమె చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఆ ఇల్లు పూర్తి కాబోతుందట. ఇక ఇది తెలుసుకుంటున్న నెటిజన్లు నిహారికకు మరింత ఫ్రీడమ్ దొరికినట్టే అని అంటున్నారు.
కాగా, నిహారిక చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమీ లేవు. కానీ ప్రోడ్యూసర్ గా మారి సినిమాలు తెరకెక్కించే పనిలో బిజీగా మారిపోయింది. అటు సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి కుటుంబంతో లేదా వ్యక్తిగతంగా దిగిన ఫొటోలను షేర్ చేసుకుంటోంది. నెటిజన్లతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.


Click it and Unblock the Notifications











