For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాడ్ హౌస్‌లోకి నిహారిక.. మెగా అభిమానులకు షాకిచ్చే న్యూస్

By Manoj Kumar P
|

బుల్లితెరపై యాంకర్‌గా మెప్పించింది నిహారిక కొణిదెల. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటుందామె. అందుకే కేవలం బుల్లితెరకే పరిమితం అవకుండా వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలోనే 'ఒక మనసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినా.. ఏమాత్రం తగ్గని నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఇవేమీ ఆమెకు హిట్ అందించలేకపోయాయి. ఈ మూడింటి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయింది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక, తాజాగా నిహారికకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళ్తే...

సినిమాలకు గుడ్‌బై

సినిమాలకు గుడ్‌బై

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఇకపై సినిమాల్లో నటించకూడదని నిహారిక నిర్ణయించుకుందని, ఈ విషయాన్ని తండ్రి నాగబాబుతో పాటు పెదనాన్న మెగాస్టార్ చిరంజీవికి సైతం చెప్పిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లుగానే ఆమె మరో సినిమాలో నటించలేదు. దీంతో మెగా డాటర్ నిహారిక ఇకపై సినిమాలు చేయదని చాలా మంది అనుకున్నారు.

ప్రతిష్టాత్మక సినిమాలో ఎంట్రీ

ప్రతిష్టాత్మక సినిమాలో ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి రూపొందించాడు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో నిహారిక ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో నిహారిక నటించడం పట్ల మెగా అభిమానులు ఖుషీ అయ్యారు.

అక్కడ మాత్రం తగ్గనని చెప్పేసింది

అక్కడ మాత్రం తగ్గనని చెప్పేసింది

సినిమాల్లో నటించకపోయినా.. నిహారిక మాత్రం తన ప్యాషన్‌ను మార్చుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకోసమే.. వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకోవాలని ప్రయత్నాలు జరుపుతోంది. ఇందులో భాగంగానే గతంలోనే సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'ను ప్రారంభించింది. దీనిపై ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇవి సూపర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు సరికొత్త ప్రయత్నం

ఇప్పుడు సరికొత్త ప్రయత్నం

నిహారిక తన నిర్మాణంలో ‘మ్యాడ్ హౌస్' అనే వెబ్ సిరీస్‌ను ప్రారంభించింది. 100 ఎపిసోడ్స్‌తో కూడిన వెబ్‌ సిరీస్‌ ఇది. ఈ వెబ్ సీరిస్ ఏడాదిన్నర పాటు సాగుతుందట. ఈ మేరకు నిహారిక ఓ వీడియోను పోస్ట్ చేసి ఈ ప్రకటన చేసింది. మహేశ్ ఉప్పాల తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను ఇన్వినీటం వారు కో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే, మ్యాపర్ యాప్ వారు ఈ వెబ్ సిరీస్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సిరీస్ ఇటీవలే ప్రారంభం అయింది.

ఆ ఇంటిలోకి అడుగు పెట్టనున్న నిహారిక

ఆ ఇంటిలోకి అడుగు పెట్టనున్న నిహారిక

ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక.. యాక్టర్‌గానూ కనిపించనుందని తెలుస్తోంది. ఇద్దరు అమ్మాయిలు అద్దెకు ఉండే ఇంటి యజమానిగా నిహారిక కనిపించబోతుందని సమాచారం. ఇందులో ఆ ఇద్దరు యువతులను నిహారిక ఓ ఆట ఆడుకోబోతుందట. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది.

ఇంకా చాలా ఉన్నాయి

ఇంకా చాలా ఉన్నాయి

సినిమాల్లో తన లక్ బాగోకపోవడంతో ఇప్పుడు ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' ద్వారా మరిన్ని వెబ్ సిరీస్‌లు చేయాలని నిర్ణయించుకుందట నిహారిక. ఇందుకోసం ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్స్ కూడా విన్నదని తెలుస్తోంది. వీలైతే తాను నటించాలని, లేకుంటే వేరే వాళ్లను పెట్టి నిర్మాతగా వ్యవహరించాలని ఈ మెగా డాటర్ భావిస్తుందని ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

English summary
Mega Daughter Niharika Konidela, who is going to be seen in the upcoming Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy based on the life of a freedom fighter Uyyalawada Narasimha Reddy, has once again stepped into the role of a producer with a sitcom titled Mad House.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more