twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త.. అల్లు హీరోతో జత కట్టబోతున్న నిహారిక

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ప్రత్యేకమైనది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు చిత్ర సీమకు పరిచయం అవడమే. అంతేకాదు, నాగేంద్ర బాబు కూతురు నిహారిక రూపంలో ఓ హీరోయిన్ కూడా సినీరంగ ప్రవేశం చేసింది. అయితే, ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. దీంతో ఆమె ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈమె గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

    బుల్లితెరపై మెప్పించింది

    బుల్లితెరపై మెప్పించింది

    కొణెదల నాగేంద్ర బాబు తనయ నిహారిక సినిమాల్లోకి రాకముందే ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘ఢీ' అనే డ్యాన్స్‌ షోలో యాంకర్‌గా చేసింది. ఈ క్రమంలోనే తన మార్క్ డైలాగులు, బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించింది. ఈ షో తర్వాత ఆమెకు ఎన్నో చానెళ్లు అవకాశాలు ఇచ్చాయి. కానీ, నిహారిక మాత్రం మరే షోనూ చేయలేదు.

    నిరాశ పరిచిన సినిమాలు

    నిరాశ పరిచిన సినిమాలు

    ఎన్నో ఆశలతో సినీ రంగ ప్రవేశం చేసింది నిహారిక. ఈమెకు మాత్రం టాలీవుడ్ నిరాశనే మిగిల్చింది. ‘ఒక మనసు', ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఇవేమీ ఆమెకు హిట్ అందించలేకపోయాయి. ఈ మూడు సినిమాలూ ఆమెతో పాటు మెగా అభిమానులనూ నిరాశ పరిచాయి. దీంతో ఇకపై సినిమాల్లో నటించకూడదని ఆమె భావించినట్లు ప్రచారం జరిగింది.

    వెబ్ సిరీస్‌లు చేయాలని ప్లాన్

    వెబ్ సిరీస్‌లు చేయాలని ప్లాన్

    నిహారిక సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకోవాలని ప్రయత్నాలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆమె గతంలోనే సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'ను ప్రారంభించింది. దీని ద్వారానే ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇవి సూపర్ హిట్ అయ్యాయి. ఇదే బ్యానర్‌పై మరిన్ని వెబ్ సిరీస్‌లు చేయాలని నిర్ణయించుకుని కొన్ని స్క్రిప్ట్స్ కూడా విన్నదని తెలుస్తోంది. వీలైతే తాను నటించాలని, లేకుంటే వేరే వాళ్లను పెట్టి తీయాలని ఈమె భావిస్తుందని టాక్.

    బన్నీ సినిమాలో..

    బన్నీ సినిమాలో..

    నిహారిక గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈమె అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోందనేదే ఆ వార్త సారాంశం. సుకుమార్ తెరకెక్కించబోయే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం నిహారికను తీసుకుంటున్నారని తెలిసింది. ఆమె పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందట. బన్నీ అడగడంతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్ర కావడంతో మెగా డాటర్ ఓకే చెప్పిందని సమాచారం.

    ప్రస్తుతం త్రివిక్రమ్‌తో బన్నీ

    ప్రస్తుతం త్రివిక్రమ్‌తో బన్నీ

    అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరో సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు ‘వైకుంఠపురంలో' అనే టైటిల్ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

    English summary
    Mega Daughter Niharika Konidela Take Sensational Decision. She Quit To Movies. But She Will Do Web Series For Her Fans. In This Matter, Megastar Chiranjeevi, Konidela Nagendrababu supports Her. Now, One news hot topic in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X