Sreeja Konidela: భర్తకు దూరమైనా విడాకులివ్వకపోవడానికి కారణం అదేనట.. తొలిసారి రివీల్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో కల్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాపకు జన్మను కూడా ఇచ్చింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ జంట విడాకులు తీసుకోలేదు. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటూ వస్తున్న శ్రీజ తొలిసారి తన భర్త కల్యాణ్ దేవ్ కు విడాకులు ఇవ్వకపోవడంపై స్పందించింది. అందుకే ఇవ్వడం లేదంటూ వివరించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా డాటర్ శ్రీజ కొణిదెల పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే నిలుస్తుంటాయి. ఈమె తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇంట్లోంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాప పుట్టాక అతడికి దూరం అయింది. భర్తతో విడాకులు తీసుకుని మరీ తల్లిదండ్రుల చెంతకు చేరింది. తన కూతురును పెంచుకుంటూ లైఫ్ లో ముందుకెళ్లింది. అయితే తల్లిదండ్రులు.. ఈమెకు ఘనంగా రెండో పెళ్లి చేశారు. ముఖ్యంగా హీరో కల్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండోసారి కల్యాణం జరిపించారు. ఇక వీరికి కూడా ఓ పాప పుట్టింది. కల్యాణ్ దేవ్ కూడా పలు సినిమాల్లో నటించాడు కూడా. విజేత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

రెండో పెళ్లి తర్వతా ఆమె లైఫ్ సెట్ అయింది అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు భర్తతో హాయిగా గడుపుతున్న ఈమెను చూసి అంతా మురిసిపోయారు. కానీ ఆ ఆనందాన్ని ఎంతో కాలం కాపాడలేకపోయింది శ్రీజ. ముఖ్యంగా భర్త కల్యామ్ దేవ్ తో మనస్పర్థల కారణంగా ఆయనకు దూరం అయింది. ప్రస్తుతం శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే ఉంటుండగా.. కల్యాణ్ దేవ్ అతని తల్లిదండ్రులతో ఉంటున్నారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించకపోయినా.. వీరు విడిగానే ఉంటున్నారు. ఇక ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. వీరి కూతురు మాత్రం కొద్ది రోజులు తండ్రి దగ్గర కొద్ది రోజులు తల్లిదగ్గర ఉంటుంది.
అయితే వీరిద్దరూ దూరంగా ఉండబట్టి చాలా రోజులే అవుతుండగా.. తొలిసారి శ్రీజ తన భర్తతో విడాకులపై స్పందించింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అయితే అందులో.. ఓ అమ్మాయి "తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉందని.. కానీ తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్త కోరుతున్నాడంటూ" ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్ కు ప్రశ్న పంపింది. ఇందుకు సమాధానంగా వాళ్లు.. ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోవాలి అంటూ చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను స్క్రీన్ షార్ట్ తీసిన శ్రీజ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది.

ముఖ్యంగా ఈ విడాకుల విషయంపై స్పందిస్తూ.. బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్లడం, మంచి డ్రెస్ లు కొనుక్కోవడం, అందంగా తయారవడం, మీకోసం మీకు నచ్చిన గిఫ్టులను మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్ అని చెప్పుకొచ్చింది. మళ్లీ మీరే ఓసారి ఆలోచించుకోండి అంటూ తెలిపింది. సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్.. మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకు ఉందా అంటూ శ్రీజ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె పెట్టి ఈ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన చాలా మంది.. భర్తతో సంతోషంగా ఉండలేకే శ్రీజ కల్యాణ్ దేవ్ కు దూరం అయిదని అంతా అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











