పుష్ప 2 కి 'మెగా' దెబ్బ .. షోస్ కొనేవారే లేరా? దీని వెనుక అస్సలు స్టోరీ ఏంటంటే

గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో కొంచెం రసవత్తర పరిస్థితులే కనిపిస్తున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా మెగా హీరోస్ లో అయితే ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్ ఒక వైపు మిగతా మెగా హీరోస్ అంతా ఒక వైపు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఒకే ఒక్క ఘటన మొత్తం పరిస్థితులను హీటెక్కించింది. దీనితో సోషల్ మీడియాలో అయితే పరిస్థితులు మరింత దారుణంగా కూడా మారాయి.

అల్లు అర్జున్ సహా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేసుకుంటూ భీభత్సమే సృష్టిస్తున్నారు . ఇవన్నీ చాలవు అన్నట్టుగా కొత్తగా ఫ్లెక్స్ లతో కొత్త గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీటిలో మొన్ననే అల్లు అర్జున్ కూడా ఓ షాకింగ్ పిక్ పెట్టడం మరింత కాంట్రవర్సీకి దారి తీసింది. బన్నీ ఎప్పుడు నుంచో మెగా బ్రాండ్ కి దూరంగా తన అల్లు బ్రాండ్ ని హైలైట్ చేసుకుంటూ తన ఫ్యాన్స్ తన ఆర్మీ అంటూ సినిమాలు ప్రమోట్ చేసుకుంటున్నాడు.

mega effect on pushpa 2 benefit shows but here is another thing

ప్రస్తుతం తన బిగ్గెస్ట్ చిత్రం "పుష్ప 2" ని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ప్రమోషన్స్ ని చేస్తున్నాడు. ఐతే ఇదంతా బయట మాట కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ముమ్మాటికీ ఇలా లేవు. ఏదైతే మెగా బ్రాండ్ తో అల్లు అర్జున్ ఎదిగాడో ఇపుడు ఆ మెగా ఫ్యాన్స్ అంతా తన విషయంలో డిజప్పాయింట్ గానే ఉన్నారని చెప్పాలి. చాలా చోట్ల ఐతే తన సినిమాలు చూసేది లేదు అని తెగేసి చెబుతున్నారు.

ఈ ఎఫెక్ట్ ఇపుడు పుష్ప 2పై భారీ లెవెల్లో పడినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. జనరల్ గా ఈ రేంజ్ పాన్ ఇండియా సినిమాలకి మన తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ పడాల్సిందే. మరి మెగా హీరో నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే ఆ హడావుడి కూడా వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇపుడు పుష్ప 2 కి ఏపీలో బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తే ఆశ్చర్యకరంగా ఆ షోస్ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట.

mega effect on pushpa 2 benefit shows but here is another thing

దీనితో పుష్ప 2 బెనిఫిట్ షోస్ కి డిమాండ్ లేదు అంటూ ఓ టాక్ ఇపుడు సినీ వర్గాల్లో స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ టాక్ వేగంగా స్ప్రెడ్ అయ్యేసరికి తెలుగు రాష్ట్రాలలో మాత్రం మెగా అభిమానుల సపోర్ట్ లేకపోతే అల్లు అర్జున్ కి బెనిఫిట్ షోస్ పడే సీన్ లేదు అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. ఇది ప్రస్తుతం పెద్ద చర్చకే దారి తీయగా ఈ కొత్త కాంట్రవర్సీపై మరో వెర్షన్ వినిపిస్తుంది.

మెగా కాంపౌండ్ నుంచే కొన్ని వర్గాలు పుష్ప 2 పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అంటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం మెగా ఫ్యాన్స్ బెనిఫిట్ షోస్ తీసుకుంటే కొన్ని చోట్ల అల్లు అర్జున్ అభిమానులు తీసుకుంటున్నారట. అల్లు అరవింద్ మీద గౌరవంతో చాలా మంది మెగా అభిమానులు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలా మొత్తానికి పుష్ప 2 విషయంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద డ్రామానే నడుస్తుందని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X