»   » వాటి కోసం..కోట్లు ఖర్చు పెడుతున్న మెగా ఫ్యామిలీ

వాటి కోసం..కోట్లు ఖర్చు పెడుతున్న మెగా ఫ్యామిలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవి చాలా కోల్పోయాడనేది బహిరంగ రహస్యమే. తన స్టార్ ఇమేజ్ తో పాటు, పరువు, పలుకుబడి పోగొట్టుకుని, రాజకీయంగా చాలా తప్పటడుగులు వేసి జనాల్లో చులకనైపోయాడు. దీంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఆ మధ్య అమెరికా వెళ్లి లైఫో సెక్షన్ సర్జరీ చేయించుకుని స్లిమ్ గా తయారై వచ్చాడు. ఈ సర్జరీ కోసం చిరు దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టారట.

చిరంజీవి మాదిరే ఆయన సినిమా వారసులు కూడా సర్జరీల మీద సర్జరీలు చేయించుకుంటూ కోట్లు ఖర్చు చేస్తున్నారు. చిరు మేనల్లుడు అల్లు అర్జున్ విషయానికొస్తే 'గంగోత్రి" సినిమాలో అల్లు అర్జున్ ముఖానికి..ఇప్పటి బన్నీ ముఖానికి చాలా తేడాలు వచ్చాయి. అప్పటి కంటే అర్జున్ ఇప్పడు అందంగా, హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. ఇందుకు కారణం అర్జున్ తన ముఖానికి చేయించుకున్న కాస్మొటిక్ సర్జరీలే అని ఫిల్మ్ నగర్ టాక్. రామ్ చరణ్ కూడా ఈ విషయంలో ఏమీ తీపోలేదు. చిరుత సినిమా తర్వాత చరణ్ ముఖానికి కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నాడు. చిరుత ముఖానికి, మగధీర ముఖానికి చాలా తేడాలు ఉండటమే ఇందుకు నిదర్శనం.

తాజాగా అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు. 100%లవ్ సినిమా తమిళ రీమేక్ లో నటించబోతున్నాడు. వ్యాంపు ఫేసుతో, లావెక్కిన శరీరంతో ఉండే శిరీష్ హీరోగా నటించడం ఏమిటని అంతా పెదవి విరిచారు. కానీ మెగా కుటుంబం ఇవేమీ పట్టించుకోకుండా శిరీష్ హీరోగా సినిమా రూపొందిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత శిరీష్ ను చూసిన జనాలు అవాక్కవుతారని వారి ధీమా. ఈ మేరకు శిరీష్ ను హీరోలా తయారు చేయడానికి అతనికి చాలా సర్జరీలు చేయించి హీరో లుక్ వచ్చేలా చేశారని సమాచారం. ఈ విధంగా సర్జరీల కోసం మెగా కుటుంబం....కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది.

English summary
Mega Family Spending Crores On Surgeries. Chiranjeevi, went to USA and underwent liposuction surgery spending almost Rs 1 Cr there.Allu Arjun also corrected his face. Ram Charan also made some changes to his face with cosmetic surgery and hence his look before Chirutha and after Magadheera is unmatchable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu