మగధీరుడే తలెగరేసేలా విజయాన్ని ఇస్తాడనే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

By Sindhu

గత ఏడాది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన పరాభవానికి, పాలకొల్లులో చిరంజీవి ఓటమి చేసిన గాయానికి 'మగధీర" మందేసింది. తల దించుకున్న చిరు అభిమానులు మళ్లీ విజయగర్వంతో తలెత్తుకునేలా చేసింది. రాజకీయాల మాటెలా ఉన్నా తెలుగు చిత్ర సీమ వరకు మెగా ఫ్యామిలీదే సింహాసనమని చాటింది. అయితే ఈ ఏడాది దానిని తారుమారు చేసింది. ఈ ఏడాది ఇంతదాకా విడుదలైన మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలన్నీ దారుణంగా ప్లాపయ్యాయి. తమ ఫ్యామిలీలో మిగతా హీరోలు ప్లాపిస్తే తన సినిమాతో సక్సెస్ కొట్టి ఫాన్స్ కి ఊరటనిచ్చే అల్లు అర్జున్ ఈ ఏడాది ఆరంభంలోనే 'వరుడు"గా దారుణమైన ఫలితాన్ని చవిచూశాడు. ఆ తర్వాత 'వేదం" తో ప్రయోగానికి తెగించి పరాజయాన్ని కొనితెచ్చుకున్నాడు. ఇక 'పులి" సంగతి సరేసరి.

పవన్ కళ్యాణ్ కి అలవాటుగా మారిపోయిన ప్లాపుల చరిత్రని ఇదీ కొనసాగించింది. తమ హీరోల సినిమాలు ప్లాపయినా పర్లేదు కానీ..అదే సమయంలో నందమూరి హీరోలు విజయాలు సాధించడం మెగాభిమానులకి భారంగా పరిణమించింది. రికార్డుల పరంగా 'మగధీర" ఛాయలకు వెళ్లే మరో సినిమా ఏదీ రాకపోయినా, ఇంకా రికార్డులన్నీ తమవే అయినా కూడా విజయాలు లేని లోటు వారిని వేదిస్తోంది. ఈ తరుణంలో వస్తున్న రామ్ చరణ్ 'ఆరెంజ్" పై ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. మళ్లీ మగధీరుడే తమకు తలెగరేసేలా విజయాన్ని అందిస్తాడని వారు ఆశిస్తున్నారు. ఆడియో సూపర్ హిట్ కావడం వారి నమ్మకాన్ని పెంచేస్తోంది. ట్రెయిలర్స్ అన్నీ వారిని ఊరిస్తున్నాయి. అయితే మాస్ హీరోగా హిస్టరీ రీరైట్ చేసిన చరణ్ క్లాస్ హీరోగా అదే ఫీట్ రిపీట్ చేస్తాడా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X