అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ షాకింగ్ నిర్ణయం.. పుష్ప -2కు కష్టాలు తప్పవా?

గత కొంతకాలంగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య బంధం బీటలు వారినట్టుగా అనిపిస్తోంది. మరి ఈ ఎఫెక్ట్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ పుష్ప టు ఫై పడుతుందా అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

చాలా రోజుల నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ ల వల్ల ఇరు కుటుంబాల మధ్య సమస్యలు ఎక్కువయ్యాయి అన్న వాదన ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఇదంతా అల్లు అర్జున్ వల్ల జరుగుతోంది అంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు.

Mega Fans boycott Allu Arjun Pushpa 2 will have an effect

అంతేకాకుండా బన్నీ చాలా కాలం నుంచి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పకపోవడం దగ్గర నుంచి, ఇటీవల జరిగిన మెగా పార్టీ వరకు ఆయన దూరంగానే ఉంటున్నారు. ఏదైతేనేం ఇప్పటిదాకా కేవలం మెగాస్టార్ అభిమానులకు మాత్రమే అల్లు అర్జున్ అంటే పీకల్లోతు కోపం ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చేరిపోయారు.

ఏపీలో రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడి కోసం ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సొంత మామ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేయడం మానేసి ఆపోజిట్ పార్టీకి బన్నీ అండగా నిలవడం మెగా పవర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

Mega Fans boycott Allu Arjun Pushpa 2 will have an effect

అంతేకాదు నాగబాబు కూడా ఈ విషయం గురించి పరోక్షంగా విమర్శిస్తూ ట్విట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సినిమా కార్యక్రమాలకు ఆయనతో పాటు మెగా కుటుంబ సభ్యులు అంతా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ పుష్ప 2పై గట్టి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పుష్ప 2 మూవీని మెగా పవర్ స్టార్ అభిమానులు పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈ మూవీని హిట్ చేసే బాధ్యతను కేవలం అల్లు అభిమానులు మాత్రమే భుజానికి ఎత్తుకోవాలి. మరి పుష్ప 2 మూవీని హిట్ చేసే బాధ్యతను అల్లు అభిమానులు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X