మహేష్ తో ఖైదీ రీమేక్ న్యాయబద్దంగా లేదంటున్న మెగా ఫ్యాన్స్..!?
చిరంజీవి అభిమానులకి ఖైదీ సినిమా గురించి ప్రత్యేకమైన పరిచయాలేమీ అక్కర్లేదు. చిరంజీవి చిరంజీవి అవ్వడంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తిరిగి రీమేక్ చేయాలనే ఆలోచన జరుగుతోంది. ఖైదీ రీమేక్ అంటే అది చరణ్ తోనే చేస్తారని, చేయాలని మెగా అభిమానులు ఆశిస్తారు. కానీ ఖైదీ రీమేక్ చేయాలని ఉబలాటపడుతున్న పూరి జగన్నాథ్ మాత్రం ఆ పాత్రలో చరణ్ ని కాకుండా మహేష్ బాబుని ఊహించుకుంటున్నాడు.
మూడేళ్ల క్రితమే మహేష్, తాను ఈ చిత్రం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశామని, ఇద్దరికీ చిరంజీవి ఇష్టమే, ఖైదీ ఇష్టమే కనుక చేసేయాలని కూడా అనుకుంటున్నామని పూరి చెప్పాడు. అయితే ఈ ఆలోచన మహేష్ అభిమానులని అయోమయానికి గురి చేస్తుంటే, చిరంజీవి ఫాన్స్ కేమో ఆగ్రహం తెప్పిస్తోంది. చిరంజీవి సినిమా రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు న్యాయబద్దంగా ముందు అతని తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని సంప్రదించాలని, అతను చేయనని చెప్పిన పక్షంలో అది వేరొక హీరోతో చేసుకోవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











