రాజకీయ నేపద్యంలో మెగా హీరో సినిమా, విలన్ కూడా రాజకీయనాయకుడే!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాజకీయ నేపద్యంలో ఉంటుందని సమాచారం.

డివివి దానయ్యతో చరణ్ సినిమా..
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దేవి, బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన కైరా అద్వాని ఈ సినిమాలో చరణ్ సరసన నటిస్తుండడం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గతంలో బోయపాటి, దేవి కలిసి చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

రాజకీయ నేపద్యంలో చరణ్, బోయపాటి సినిమా
చరణ్, బోయపాటి కాంబినేషన్ సినిమా అనగానే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఓ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూడడం సహజం. వారి అంచనాలకు తగట్టు ఈ సినిమా ఉంటుందని సమాచారం. తాజా సమాచారం మేరకు ఈ సినిమా కొంతవరుకు రాజకీయ నేపద్యంలో నడిచే కథగా బోయపాటి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్న వివేక్ ఒబెరాయ్
ఈ చిత్రంలో నటించే విలన్ వివేక్ ఒబెరాయ్ కూడా ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోలను ఎక్స్‌ట్రార్డినరీగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను అద్భుతమైన కథతో రామ్‌చరణ్‌ను సరికొత్త రీతిలో చూపించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











