ఆ హీరోయిన్‌తో మెగా హీరో డేటింగ్? త్వరలోనే పెళ్లి??

దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కూడా తమ తోటి హీరోలు హీరోయిన్స్ డేటింగ్‌లు, ప్రేమలు, బ్రేకప్‌లు ఇలా చాలానే ఉంటాయని అందరికీ తెలిసిందే. మన తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది హీరోలు హీరోయిన్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు కుటుంబాలకి చెందిన హీరోల్లో చూసుకుంటే ప్రేమ పెళ్లిళ్లు ఒకింత ఎక్కువే కనిపిస్తాయి.

అయితే సినీ పరిశ్రమ నుంచే ఇద్దరు కలిసి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారు దాదాపు మెగా అండ్ ఘట్టమనేని, అక్కినేని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ గానే అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య అలాగే హీరోయిన్ శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు మెగా కుటుంబం నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు తమ ప్రేమ పెళ్ళికి ఒక ఏడాది కూడా పూర్తయ్యింది అని విష్ కూడా చేసుకున్నారు.

mega hero is in relationship with vijay devarakonda heroine

కాగా మెగా కుటుంబం నుంచి ఇంకొందరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉంటే వారిలో మెగా మేనల్లుళ్లు సాయి దుర్గ తేజ్, అలాగే తన తమ్ముడు ఉప్పెన ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ లు కనిపిస్తారు. వీరిలో సాయి దుర్గ తేజ్ ఎప్పటి నుంచో తన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ ఫార్ములాని రియల్ లైఫ్ లో కూడా చాలా సీరియస్ గా తీసుకొని ప్రస్తుతానికి ప్రేమలు, పెళ్లిళ్లు లాంటివి పెట్టుకోవడం లేదని పలుమార్లు చెప్పేసాడు.

కానీ తన తమ్ముడు మాత్రం ఇపుడు ఏదో గుడ్ న్యూస్ పట్టుకొచ్చేలానే ఉన్నాడు అంటూ పలు పుకార్లు వినిపిస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ మన తెలుగు సినిమాకి చెందిన ఓ యువ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు పెళ్లి చూపులు ఫేమ్ యంగ్ బ్యూటీ రీతూ వర్మ అట. అలాగే ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

mega hero is in relationship with vijay devarakonda heroine

మరి వీరి రిలేషన్ షిప్ గాసిప్స్ లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలీదు కానీ ప్రస్తుతం ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నిజంగానే ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారా లేక ఇవన్నీ వట్టి గాలి వార్తలేనా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. ఇక ఇవి పక్కన పెడితే వైష్ణవ్ తేజ్ లాస్ట్ గా ఆది కేశవలో కనిపించాడు. అలాగే రీతూ వర్మ రీసెంట్ గా "స్వాగ్" లో కనిపించింది.

వైష్ణవ్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ అయ్యింది కానీ ఆ తర్వాత తన నుంచి మరో సినిమా ఇంకా రాలేదు. అలాగే రీతూ వర్మ మాత్రం ప్రస్తుతం పలు మిడ్ రేంజ్ సినిమాలు వరకు తెలుగులో తమిళ్ మరియు మలయాళ భాషల్లో చేస్తూ వస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఈ ఇద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా లేకుండానే ఇలాంటి రూమర్స్ రావడం గమనార్హం.

More from Filmibeat

Read more about: sai dharam tej
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X