మెగా హీరోతో రియా చక్రవర్తి సినిమా.. చివరికి ఓటీటీలోనే రాబోతోంది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ మార్కెట్ మరోసారి ఊపందుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బడ్జెట్ చిన్న బడ్జెట్ అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి. ఆలస్యం అయితే మరింత నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతలు మంచి డీల్స్ తో విడుదలకు ఒప్పుకుంటున్నారు. మరొక మెగా హీరో సినిమా కూడా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అందులో రియా చక్రవర్తి హీరోయిన్ గా నటించింది.

అనేక రకాల విమర్శలతో

అనేక రకాల విమర్శలతో

ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ గా ఉండగా ఒక పాత్రలో రియా చక్రవర్తి నటించింది. హీరో సుశాంత్ రాజ్ మాజీ ప్రియురాలైన రియా అనేక రకాల విమర్శలతో చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మెల్లగా మళ్ళీ సినిమా ఛాన్సులు అందుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

పాత గాయల్ని మార్చిపోయి

పాత గాయల్ని మార్చిపోయి

డ్రగ్స్ కేసులో కూడా అనేక రకాల ఆరోపణలు దాటి బయటకు వచ్చిన రియా పాత గాయల్ని మార్చిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఆ మధ్యలో తమ్ముడితో కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. మళ్ళీ ఫిట్నెస్ కోసం కష్టపడుతున్న రియా హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కోసం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

మెగా హీరో.. సూపర్ మచ్చి

మెగా హీరో.. సూపర్ మచ్చి

అయితే ఈ వివాదాల కంటే ముందే రియా చక్రవర్తి ఒక తెలుగు సినిమాలో నటించింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాలో రియా చక్రవర్తితో పాటు రచిత రామ్ మరో హీరోయిన్ గా నటించింది. రెండేళ్ల క్రితం సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా మధ్యలో కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

అమెజాన్, ఆహా ఆఫర్స్..

అమెజాన్, ఆహా ఆఫర్స్..

ఇక మొత్తానికి సూపర్ మచ్చి సినిమాను ఓటీటీలోనే విడుదల చేసేందుకు నిర్మాత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో కొన్ని మంచి ఆఫర్స్ వచ్చినప్పటికి థియేటర్స్ ఓపెన్ అవుతాయనే నమ్మకంతో రిజెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ హవా చూస్తుంటే థియేటర్స్ ఇప్పట్లో తెరచుకోవడం అసాధ్యం. ఓటీటీలోనే రిలీజ్ చేయడం బెటర్ అని ఆహా, ఆమెజాన్ ప్రైమ్ వంటి ఆఫర్స్ పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X