ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్.. మెగా హీరో కోసం కాళ్లు అరిగేలా తిరిగారు.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మెగా యంగ్ హీరో గోల్డెన్ చాన్స్ ను మిస్ చేసుకున్నారు. ఆయనతో సినిమా చేయాలని ఏకంగా ఇండియాస్ సెన్సేషనల్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆయన తెలిసో తెలియకనో బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆ మెగా యువ హీరో ఎవరు? సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ లు ఎప్పుడు కలిశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

రోల్ మోడల్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
ఇండియాలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలతో భారీ ప్రాజెక్టును తెరకెక్కించే పనిలో ప్రశాంత్ నీల్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈయన తొలుత ఉగ్రం అనే కన్నడ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కే జి ఎఫ్ ఫ్రాంచైజీలు చాప్టర్ 1, చాప్టర్ 2 తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన ఫిలిం మేకింగ్ స్టైల్ తో రాబోయే నూతన దర్శకులకు రోల్ మోడల్ గా నిలిచారు. ఇక ప్రభాస్ తోను సలార్ తీసుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను రూపొందిస్తున్నారు.

Mega Hero Missed Golden Chance to work with Lokesh Kanagaraj and Prashanth Neel

సినిమాటిక్ యూనివర్స్ తో లోకేష్ కనరాజ్..
ప్రస్తుతం లోకేష్ భారీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన తొలి చిత్రం తమిళంలో అవియల్ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఆ తర్వాత తెలుగులో మనగరం, అలాగే ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను తనదైన శైలిలో పరిచయం చేశారు. ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇద్దరూ సినిమాల చేయాలనుకున్నది ఎవరితో..
తమ తమ ప్రాజెక్టులతో ఇటు ప్రశాంత్ నీల్, అటు లోకేష్ కనకరాజు ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరి కెరియర్ 2016 నుంచి ప్రారంభం అవడం విశేషం. ఆ సమయంలో వీరికి పెద్దగా హిట్స్ లేవు. దీంతో మెగా కాంపౌండ్ లోనే టాలెంటెడ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ తన ప్రాజెక్ట్స్ తో బిజీ ఉండడం వల్ల వారితో సినిమా చేయలేకపోయారని తెలుస్తోంది.

ప్రస్తుతం వీరి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్..
ప్రశాంత్ నీల్ నుంచి నెక్ట్స్ డ్రాగన్స్, సలార్ 2 రావాల్సి ఉంది. ఇక కనగరాజ్ నుంచి కూలి, విక్రమ్ 2, ఖైదీ 2 వంటి చిత్రాలు రావాల్సి ఉంది. ఇక సాయి ధరమ్ తేజ్ చివరిగా రిపబ్లిక్, విరూపాక్ష, బ్రో, సత్య వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. నెక్ట్స్ సంబరాల యేటు గట్టు చిత్రంతో అలరించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X