twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ బాటలోనే.. ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని న్యూ ప్లాన్..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కథల జోరు పెరుగుతోంది. బాహుబలి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. 100కోట్ల బడ్జెట్ అంటే చాలు అంతకు మించి అనేలా పాన్ ఇండియా ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయి. ఇక RRR ద్వారా అందులో నటిస్తున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా భవిష్యత్తులో నేషనల్ వైడ్ మార్కెట్ ని ఎక్కువగా టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

    RRRను దర్శకుడు రాజమౌళి తప్పకుండా హిట్ చేస్తాడని చెప్పవచ్చు. ఇక ఆ తరువాత ఇద్దరు హీరోలకు బాలీవుడ్ లో ఒక స్పెషల్ మార్కెట్ అయితే ఏర్పడుతుంది. ముందు నుంచే తారక్ పాన్ ఇండియా కథలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్టును ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. త్రివిక్రమ్ ప్రాజెక్టును కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని చూస్తున్నాడు.

    mega hero ram charan looking for a pan india projects

    ఇక రామ్ చరణ్ కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ కథలు చాలానే వచ్చినప్పటికీ చరణ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. ఇదివరకే ఒకసారి బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న చరణ్ ఈ సారి మాత్రం RRR ద్వారా వచ్చే క్రేజ్ ని ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నాడు.

    వెంకీ కుడుముల, సందీప్ రెడ్డి వంగ, అలాగే మరికొందరు సక్సెస్ ఫుల్ దర్శకులు కథలు చెప్పినప్పటికీ కూడా రామ్ చరణ్ ఒప్పుకోలేదు. అందుకు కారణం ఆ కథలు కేవలం తెలుగులో మాత్రమే వర్కౌట్ అవుతాయట. కానీ రామ్ చరణ్ కి బాలీవుడ్ తమిళ్ లో కూడా వర్కౌట్ అయ్యేలా మరిన్ని పాన్ ఇండియా కథలు కావాలట. వచ్చే దర్శకులకు కూడా అదే చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

    English summary
    Director Rajamouli described his experiences as well as future plans in his first interview after recovering from Corona. Rajamouli, who fell a corona heavy a few days ago, has recently become an ideal for everyone with a plasma donation. However, in Corona Time, he said that he followed two things regularly and was scared of the virus. He also spoke on RRR, Mahabharata and Adi Purush projects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X